పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన నితిన్ తాను పవర్ స్టార్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా చెప్పుకుంటూ ఉంటాడు. తన సినిమా ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా నితిన్ ఉపన్యాసం ముగించడు. దీనితో పవర్ స్టార్ అభిమానులకు కూడ నితిన్ అంటే ప్రత్యేకమైన అభిమానం. 


ఇటువంటి పరిస్థితులలో ఇప్పటికే జరగవలసిన నితిన్ పెళ్ళికి కరోనా తో పాటు పవన్ కళ్యాణ్ తో లింక్ కూడ ఉంది అంటూ ఒక ఆసక్తికరమైన గాసిప్ ఈ లాక్ డౌన్ సమయంలో ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. వాస్తవానికి రెండు రోజుల క్రితం జరిగిన నిఖిల్ తరహాలోనే నితిన్ పెళ్ళి కూడ సింపుల్ గా జరుపుకోవచ్చు కదా అన్న సూచనలు ప్రస్తుతం నితిన్ కు కొందరు ఇచ్చినప్పటికీ ఆ సూచనల పట్ల నితిన్ పెద్దగా ఆసక్తి కనపరచలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

 

కేవలం పరిమిత సంఖ్యలో బంధువుల మధ్య తన పెళ్లి చేసుకోవడం తనకు ఆసక్తి లేదని కరోనా సమస్య పూర్తిగా తొలిగిపోయేదాకా వేచి ఉండి తాను పెళ్ళి చేసుకుంటాను అని అంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తన పెళ్ళికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చి తీరాలని ఇప్పటికే ఈ విషయమై పవన్ కళ్యాణ్ ను కోరానని నితిన్ చెపుతున్నట్లు టాక్.


కరోనా పూర్తిగా భారత్ నుండి వెళ్లిపోయి పెళ్ళిళ్ళ పై ప్రభుత్వాలు విధించిన నిషేధం తొలగించే వరకు నితిన్ ఇలాగే భీష్ముడు లాగే కొనసాగవలసి వస్తుంది. అయితే అది ఎన్ని నెలలు మరెంత కాలం అన్నది ప్రస్తుతం ఆడంబరంగా పెళ్ళి చేసుకుందాము అని నితిన్ లా భావిస్తున్న ఏ ఒక్కరికీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. లాక్ డౌన్ పిరియడ్ తో బాగా ఖాళీగా ఉండటంతో చాలామంది యంగ్ హీరోలు తమ పెళ్ళిళ్ళ గురించి ఆలోచనలు చేసుకుంటున్నారు అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్న పరిస్థితులలో రానున్న రోజులలో టాలీవుడ్ లో చాలామంది బ్రహ్మచారులు గృహస్తులుగా అయ్యే ఆస్కారం ఉంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: