టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలకు మంచి డిమాండ్ అనేది వచ్చింది. చిన్న చిన్న సినిమాలను తీయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చిన్న నిర్మాతలు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలను చెయ్యాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి సినిమాలు చేసే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. మన తెలుగు లో ఇప్పుడు నిర్మాతలు నష్టాల నుంచి బయటపడటానికి గానూ చాలా వరకు కష్టాలు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కొందరికి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ముఖ్యంగా యువ హీరోలకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న హీరోలు కూడా తమ భవిష్యత్తు విషయంలో ఎంతో భయపడుతున్నారు అనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు వారికి అండగా నిలబడటమే కాదు మార్కెట్ లో తాము కూడా నిలబడాలి అనే భావన లో ఉన్నారు. అందుకే ఇప్పుడు చిన్న హీరోలకు అవకాశం ఇవ్వడానికి గానూ కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు అని తెలుస్తుంది. ముఖ్యంగా అగ్ర హీరోలతో సినిమాలను చెయ్యాలని భావించిన వారు అందరూ కూడా ఇప్పుడు చిన్న హీరోలను ఎక్కువగా దృష్టి లో పెట్టుకున్నారు అని అంటున్నారు. 

 

చిన్న హీరోలు కూడా ఇప్పుడు తమ భవిష్యత్తు ని దృష్టి లో పెట్టకుని ఎక్కువగా  పారితోషికం అడగవద్దు అనే భావన లో ఉన్నారు అని సమాచారం. దీనిని హీరోలు కూడా క్యాష్ చేసుకుని, నిర్మాతలతో సినిమాలు చెయ్యాలని భావిస్తున్నారు. ఈ జాబితాలో నానీ వంటి హీరో కూడా ఉన్నాడు అని సమాచారం. మరి శర్వానంద్ లాంటి వారు అయితే ఎలాంటి సినిమాలను చేస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం శర్వా ఏ దర్శకుడి తో కూడా సినిమా చేయడం లేదు అనే సంగతి తెలిసిందే మరి ఏ సినిమా చేస్తాడు అనేది త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: