రాజమౌళి సినిమా అనగానే మన తెలుగులో ముందు నుంచి కూడా ఒకరకమైన క్రేజ్ ఉంటుంది అనేది వాస్తవం. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ప్రారంభమైన రాజమౌళి ప్రస్థానం బాహుబలి ది కంక్లూజన్ సినిమాతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఎల్లలు దాటేసింది. బాహుబలి ది కంక్లూజన్ సినిమా రాజమౌళిని ప్రపంచ స్థాయి వ్యక్తిని చేసేసింది. రాజమౌళి సినిమాలను చూడటానికి అభిమానులు పనులు మానుకుని ఎదురు చూసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అయితే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారు అనేది అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ లో కూడా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే క్రేజ్ ని ముందే గ్రహించిన బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమా హక్కులను బాలీవుడ్ లో కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు వంద కోట్లకు పైగానే ఇచ్చి హక్కులను కొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బాహుబలి ది కంక్లూజన్ సినిమా అయితే బాలీవుడ్ లోనే ఏకంగా రు. 600 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి.. బాలీవుడ్ వాళ్లకు మైండ్ పోయేలా చేసింది. ఈ సినిమా కోసం బాలీవుడ్ అగ్ర నిర్మాత ఒకరు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ద్వారా ఆయన రాజమౌళి తో చర్చలు కూడా జరిపారు అని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ ద్వారా కూడా ఆయన ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఆ సినిమా కోసం గానూ ఇప్పుడు తాము ప్రచారం చేయడమే కాదు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి రాజమౌళి సహా నిర్మాత దానయ్య ఈ అవకాశాన్ని బాలీవుడ్ జనాలకు ఇస్తారా లేదా అనేది చూడాలి.