సాధారణంగా చాలా మంది స్టార్ హీరోలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక సినిమా ఓకే చేసిన తర్వాత వాళ్లకు సంబంధించిన అన్ని ఖర్చులను కూడా నిర్మాతలు చచ్చినట్టు భరించే పరిస్థితి అనేది ఉంటుంది. కాని మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అలాంటి వాతావరణం ఏ రోజు కూడా లేదు అని అంటారు టాలీవుడ్ జనాలు. అతను ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం అనేది లేదు అని అంటారు. సినిమా మొదలుపెట్టే సమయంలో ఇంత బడ్జెట్ అని అతనికి తెలిసిన వెంటనే బడ్జెట్ లోబడే ఉంటాడు గాని అతనికి నచ్చిన కోరికలు కోరే సమయం ఎప్పుడు లేదని అంటారు. 

 

అతను విదేశాల్లో షూటింగ్ కి వెళ్ళిన సమయంలో అయినా సరే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు అని చెప్తూ ఉంటారు. విదేశాల్లో షూటింగ్ కి వెళ్తే నిర్మాతను ఆ హోటల్ కావాలి అక్కడ కావాలి ఇక్కడ కావాలి అని అడిగే వాతావరణం ఉండదు అని నిర్మాత బడ్జెట్ ఆధారంగా ఎక్కడ చూసినా సరే అతను ఓకే అంటాడు అని అంటారు. ఇక విహార యాత్రలకు సినిమా షూటింగ్ సమయంలో వెళ్ళే ప్రయత్నం చేయడు అని బడ్జెట్ పెరిగే ఏ కార్యక్రమం కూడా అతని నుంచి ఉండదు అని అంటారు. నిజం ఎంత అనేది తెలియదు గాని రవాణా ఖర్చులు అతనే పెట్టుకుంటాడు అని అంటారు. 

 

టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఈ స్థాయిలో ప్రవర్తించిన సందర్భ౦ అనేది లేదు అంటారు.  ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అతను చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కావడం చాలా కష్టం అని అంటున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: