ఒక గొప్ప గేయ రచయితగా కళామతల్లి ముద్దుబిడ్డ... తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ... గేయ రచయితగా ఆయనకు తిరుగులేదు అని నిరూపించుకున్న గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈయనను తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కళాతపస్వి గా చెప్పుకుంటారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన ఎన్నో పదాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతాన్ని సృష్టించాయి  అని చెప్పాలి. కేవలం సినిమాలోని డైలాగులు మాత్రమే కాదు సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ప్రభావితం చేసి మార్పులు తెస్తాయి అని నిరూపించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఎన్నో పాటలు  తెలుగు చిత్ర పరిశ్రమలో మైళ్ళు రాళ్లుగా  నిలిచిపోయాయి. 

 


 కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల అనే సినిమాతో తెలుగు తెరకు గీత రచయితగా పరిచయమైన సిరివెన్నెల సీతారామశాస్త్రి... మొదటి సినిమాతోనే అద్భుతమైన గేయ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంచి గుర్తింపు తెచ్చుకోవడం లో దర్శకరత్న దాసరి నారాయణరావు ఎంతగానో కృషి చేశారు. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ప్రస్థానం ప్రారంభించి ఇప్పటికే దశాబ్దాలు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ ఆయన నాటి తరం ప్రేక్షకుల నుంచి నేటి తరం ప్రేక్షకుల వరకు తన పాటలతో అందరినీ అలరిస్తూ నే ఉన్నారు. 

 


 ఇప్పటికే ఎన్నో సినిమాల్లో వేల సంఖ్యలో పాటలు రాసి ఎంతో గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇక ఆయన సినీ రంగంలో చేసిన సేవలకుగాను ఏకంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఘనంగా సత్కరించింది. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన ఎన్నో గొప్ప పాటలు ఉన్నప్పటికీ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటల్లో  ఆయనకు బాగా నచ్చిన పాట మాత్రం ఆహ్వానం సినిమాలో పందిరి వేసిన ఆకశానికి అనే పాట. ఈ పాట ఆయన రాసిన పాటల్లో  ఇష్టమైన పాట గా నిలిచిపోతుంది అని సిరివెన్నెల సీతారామశాస్త్రి పలుమార్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: