ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల నాచురల్ స్టార్ గా మారిపోయాడు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని ప్రారంభించిన నాని ఆ తర్వాత అష్టా చమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత నాని కెరీర్ కి మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత వరుసగా తొమ్మిది సినిమాలు చేశాడు నాని. తొమ్మిది సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఆ తర్వాత ఏమైందో కానీ నాని చేసిన పలు సినిమాలు ఫ్లాప్ బాట పట్టాయి. నాని ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం సాధించలేకపోయాయి. 

 


 ఈ క్రమంలోనే నాని ఏకంగా తన నాచురల్ నటనతో ఓ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేసి తన నటనతో ఆకట్టుకున్నాడు . అర్జున్ అనే పాత్రలో నటిస్తాడు నాని. అర్జున్ అనే పాత్ర నేటి యూత్ కి  సంబంధించినట్లుగా ఉంటుంది....  కృష్ణ అనే పాత్ర .. పల్లెటూరి నేపథ్యంలో  సాగిపోతూ ఉంటుంది. ఈ రెండు పాత్రల్లో నాని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు తమ అభినయంతో  ఆకట్టుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో ఎక్కడో తేడా కొట్టేసింది. 

 


 దీంతో హిట్ అవుతుందన్న సినిమా కాస్త డిజాస్టర్ గా మారిపోయింది. నాని ద్విపాత్రాభినయం చేయడం అంతేకాకుండా శ్రీకాకుళం యాస లో ఇరగదీస్తూ  డైలాగులు చెబుతూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమా నాని ని  వరుస ఫ్లాపుల నుంచి గట్టెక్కిస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా అభిమానులకు నిరాశ మిగిల్చింది.ప్రేక్షకుల అంచనాల అందుకోలేక పోయింది ఈ సినిమా. దీంతో నానీ  కెరీర్లో మరో డిజాస్టర్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ తర్వాత నాని కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: