స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న మూవీ రేసు గుర్రం. సమ్మర్ రేస్ లో ఈ రేసు గుర్రం పోటీకి రానున్నదని సమాచారం. ఇక ఆడియో విషయానికొస్తే ఈ నెల 16 న రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారట. అయితే సాధారణంగా బన్ని అన్ని సినిమాల ఆడియోలు ఓ రేంజ్ లో ఫంక్షన్ చేసి రిలీజ్ చేసేవారు, కాని ఇప్పుడు అలా చేయడం కుదరక ఏదో సింపుల్ గా ముగించేద్దామనే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఒకపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వంతగా పార్టిని పెట్టి మెగా ఫ్యాన్స్ లో చీలికను తెచ్చాడు. సో ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఆడియో ఫంక్షన్ పెడితే అక్కడ లొల్లి అయ్యే అవకాశం లేకపోలేదని వారు ఈ నిర్ణయం తీసుకున్నారని ఎపిహెరాల్డ్.కామ్ కి తెలిసింది. ఇక ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వర రావు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సలోని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ సినిమాలో. ఇదవరకు మెగా సినిమా ఆడియో అంటే ఫ్యామిలీ అంతా వచ్చి సినిమా ఆడియోని ఎంకరేజ్ చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేనందుకు కొంత చింతించక తప్పదు. పవన్ పార్టి ఎఫెక్ట్ బన్ని సినిమాపై పడిందని మీరనుకుంటున్నారా..?       

మరింత సమాచారం తెలుసుకోండి: