టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెంచిన సినిమా టెంపర్. ఈ సినిమాలో తారక్ నటన చూసిన విమర్శలు అయితే షాక్ అయ్యారు అప్పట్లో. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తారక్ నటన చాలా బాగా నచ్చింది. ఇక విమర్శలు కూడా ఈ సినిమా చూసి చాలా బాగుంది అంటూ వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తారక్ నటన కే ఎక్కువగా మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు టీవీ లో వచ్చిన సరే ఈ సినిమాను కచ్చితంగా చూసే పరిస్థితి. ఇక ఈ సినిమాలో వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 

 

రేప్ అనే పధం తో పాటుగా సినిమాలో కొన్ని అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయి అని పోలీసులను అవమానించే విధంగా సినిమాను తీసుకొచ్చారు అని పలువురు తీవ్ర విమర్శలు చేసారు. సినిమాలో మరీ పోలీసులను హీనంగా చూపించారు అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేసి సినిమాను విడుదల చేయకుండా చూడాలి అని అన్నారు. ట్రైలర్ చూసే ఆ వివాదం వచ్చింది. సినిమా విడుదల తర్వాత కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ కి కొందరి నుంచి బెదిరింపు లు కూడా వచ్చాయి అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించింది. 

 

ఆ తర్వాత వివాదాలను చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ నటన చూసిన విమర్శకులు అయితే సినిమాలో అతనే హైలెట్ అని మరొకరు ఉంటే సినిమా దారుణంగా ఉంటుంది అని కొందరు కామెంట్స్ కూడా చేసారు. ఆ సినిమా అతని తో మినహా ఎవరి తో చేసినా సరే అసలు ఏ మాత్రం సినిమా కథకు గాని దర్శకుడి టాలెంట్ కి గాని అందం రాదని మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: