సాధారణంగా ఒక స్థాయికి వెళ్ళిన వారి విషయంలో సినిమాల్లో ఎన్నో ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అగ్ర దర్శకులు అయినా హీరోలు అయినా నిర్మాతలు అయినా గాయకులూ అయినా ఎవరు అయినా సరే వారి మీద ఎన్నో వ్యాఖ్యలు వినపడుతూనే ఉంటాయి. చిన్న చిన్న వాళ్ళు కూడా ఒక స్థాయి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి డబ్బే ప్రధానం అనే విధంగా కూడా ఉంటుంది. ఒక సినిమాలో కష్టాలు నష్టాలు వారికి పెద్దగా అవసరం ఉండదు. అది ఏ స్థాయిలో ఉన్న వారు అయినా సరే అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేది మనం ఎన్నో కథనాలు చదివి ఉంటాం. 

 

అయితే టాలీవుడ్ లో అయినా ఎక్కడ అయినా సరే ఎస్పీ బాలు విషయంలో ఆ విధంగా ఉండదు అని అంటూ ఉంటారు. ఎస్పీ బాలు ఒక సినిమా చేస్తున్నారు అంటే నిర్మాతను బట్టి పారితోషికం తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అంటారు. అవును ఆయన ఒక పాట పాడిన లేదా ఇంకా ఏది అయినా చేసినా సరే ఆయన మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే చేయించుకున్నారు అని అంటూ ఉంటారు. ఆయన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే కొన్ని కొన్ని సినిమా ల్లో నిర్మాతలకు నష్టాలు వచ్చాయి అంటే మాత్రం ఆయన పారితోషికం విషయంలో ఏ మాత్రం కూడా తనకు ఇవ్వాల్సింది ఇవ్వాలి అనే విధంగా ప్రవర్తించిన సందర్భం ఎప్పుడు కూడా లేదు అని అంటారు టాలీవుడ్ లో జనాలు. 

 

ఆ విధంగా ఎస్పీ బాలు తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. చిన్న వారు అయినా పెద్ద వారు అయినా ఎవరు అయినా సరే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: