టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలు అయినా పెద్ద పెద్ద సినిమాలు అయినా సరే ఇప్పుడు ఐటెం సాంగ్స్ అనేవి చాలా కీలకంగా మారాయి అని చెప్పాలి. ఐటెం సాంగ్స్ ఉంటే సినిమాలు ఖ‌చ్చితంగా హిట్ అవుతాయి అనే భావన లో ఇప్పుడు జనాలు ఉన్నారు. అగ్ర హీరోల సినిమాల్లో అయితే ఇప్పుడు ఐటెం సాంగ్స్ లేకుండా పని జరిగే అవకాశాలు కనపడటం లేదు. మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోలు అయితే అదిరిపోయే ఊర‌మాస్ ఐటెం సాంగ్స్ త‌మ సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా వస్తున్న  ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం గానూ ఎన్టీఆర్ కాజల్ కి ఫోన్ చేసినట్టు సమాచారం. ఇది టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఆస‌క్తిగా మారింది. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆమెకు ఫోన్ చేసిన ఎన్టీఆర్ తన సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యాలి అని కోరినట్టు తెలుస్తుంది. ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది అని సమాచారం. ప్రస్తుతం ఆమె ఒక సినిమాలో మాత్రమే టాలీవుడ్ లో నటిస్తుంది. 

 

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ హీరోలు త‌ప్పా ఆమెకు ఛాన్స్ ఇవ్వాల‌న్న ఆలోచ‌నే ఎవ్వ‌రూ చేయ‌డం లేదు. అందుకే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యాలి అని అడిగిన వెంటనే ఆమె ఓకే చెప్పింది అని సమాచారం. గతంలో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో ఆమె ఐటెం సాంగ్స్ తో ఊపేసిన సంగతి తెలిసిందే.  ఆ సినిమాలకు మంచి వసూళ్లు కూడా వచ్చాయి. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ కోసం కాజ‌ల్‌తో ఐటెం సాంగ్ కోరుకుంటున్నాడ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: