నేటితరం మనుషులు ఆలోచనలకి నాటితరం మనుషుల ఆలోచనలు కి ఎంతో తేడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మన పెద్దలు మనకు ఏదైనా చెబితే... వాళ్లు చెప్పేదంతా చాదస్తంగా అనిపిస్తుంది నేటి యువతకి. కానీ ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు చెప్పే పెద్దలు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని కంటనీరు పెట్టించి ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ఓ బేబీ. ఓ బేబీ సినిమా తెలుగు ఆడియన్స్ అందరి హృదయాల్లో నిలిచిపోయింది అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత రావు రమేష్ పాత్ర అయితే... తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మరిచిపోలేరు. 

 

 ఓ బేబీ సినిమాలో సమంత రావు రమేష్ లు పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది,  ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా... తెలుగు ప్రేక్షకులందరినీ మైమరిపించి  సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ నిండుగా ఉంటాయి అని చెప్పాలి. ప్రతి సన్నివేశం కుటుంబంలోని బంధాలను తెలియజేసే విధంగా ఉంటుంది. మన పెద్దలు మనకు చెప్పేది చాదస్తంగా  అనిపించినప్పటికీ పెద్దలకు మనం ఎప్పుడూ చిన్న పిల్లలమే అని తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పింది ఈ సినిమా. 

 

 అసలు పెద్దలే  లేకపోతే... తప్పు ఒప్పులు చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు అంటూ అందరిని ఆలోచింప జేసింది ఓ బేబీ సినిమా. ఇలా ఒక మనిషి జీవితంలో కుటుంబ పెద్దలు పాత్ర ఎంత ముఖ్యమో అని చాటి చెబుతూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను మెప్పించి సంచలన విజయాన్ని అందుకుంది. ఎక్కడ ఎలాంటి వల్గారిటీ లేకుండా... ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ... కలిసి సినిమా చూసేలా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు, ఇక మొత్తంగా ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: