సీనీ ప్రపంచం ఓ మాయా ప్రపంచం.. ఇక్కడ కష్టాలు ఉంటాయి.. సుఖాలు ఉంటాయి.  కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవొద్దు.. సుఖాలు వచ్చినపుడు మిడిసి పడొద్దు అని అంటున్నారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.  ప్రతి ఒక్క నటుడి జీవితంలో కష్టాలు ఉంటాయి.. ఏ కష్టం లేకుండా ఉంటే అతను మంచి నటుడు కాలేడని అన్నారు. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలను సుశాంత్ భరించలేకపోయాడని తెలిపారు. సినీ పరిశ్రమలో ఉండే 'బంధుప్రీతి' (నెపోటిజం) మధ్యే తాను నెట్టుకొస్తున్నానని, కానీ చిన్నవాడైన సుశాంత్ తట్టుకోలేకపోయాడని వివరించారు.  సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుంటే తప్పకుండా నిలబడగలమని, అప్పుడే మన కలల్ని సాకారం చేసుకోగలమని వివరించారు.

 

తన సినీ ప్రస్థానంలో ఎన్నో లోతైన గాయాలు తగిలాయని, వయసులో చిన్నవాడైన సుశాంత్ కు అలాంటి గాయాలను ఓర్చుకునే శక్తి లేకపోయిందని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నా జీవితంలో ప్రతిక్షణం యుద్దం చేస్తూనే ఉన్నానని.. అయితే నా చుట్టూ ఉన్నవాళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటానని అన్నారు. ఇక సుశాంత్ ఆ మద్య  ఇండస్ట్రీలో 'బంధుప్రీతి' ఎక్కువగా ఉందని, ప్రతిభ ఉన్నవాళ్లను ప్రోత్సహించకపోతే వారు ఎలా ఎదుగుతారని సుశాంత్ 'ఐఫా' అవార్డుల సందర్భంగా వ్యాఖ్యానించారు.

 

 

తనను బాలీవుడ్ లో జరిగే పార్టీలకు ఎవరూ పిలవడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే ఇండస్ట్రీ నుంచి తనను వెలివేసిన ఫీలింగ్ కలుగుతోందని అన్నారు. తన గుండెలో ఉన్న బాధ అంతా అందరి ముందే చెప్పేశాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరితోనూ కాంటాక్ట్ కాలేదట.. ఆ క్షణంలో ఎంతగా కృంగిపోయి ఉంటారో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కాగా, సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: