ఇప్పుడు మన తెలుగులో చాలా వరకు కొందరు నటులకు డిమాండ్ అనేది భారీగా ఉంది అనే విషయం చెప్పవచ్చు. అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి గానూ జగపతి బాబు మోహన్ లాల్ లాంటి వారిని ఎక్కువగా దర్శక నిర్మాతలు సంప్రదిస్తూ వస్తున్నారు. ఇక వారి సినిమాలకు మంచి ఆదరణ అనేది ఉంటుంది కాబట్టి తెలుగులో వారి విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక వారికి భారీగా ఇచ్చే అవకాశం ఉండటం తో స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే వారిని తీసుకునే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి ఇక నుంచి హీరో పాత్రలకు గుడ్ బై చెప్పి ఆయన స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆయన ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రి గా కనపడే అవకాశం ఉంది అనే ప్రచారం ఎక్కువగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని దీనిపై మాత్రం ఇప్పుడు చాలా వరకు చర్చలు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆయన కచ్చితంగా నటించే అవకశం ఉంది అని అంటున్నారు మరి. 

 

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమాలో చేసే అవకాశం ఉంది. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుంది అనేది చూడాలి. చాలా వరకు స్టార్ హీరోలు అందరూ కూడా ఇప్పుడు సినిమాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ  కమర్షియల్ కోణం లో మాత్రమే చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. మరి ఏ సినిమాలో చిరంజీవి నటిస్తారు అనేది చూడాలి. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: