అకీరా నందన్. ఈ పేరు వెరైటీగా ఉంది. ఈ పేరు పాషన్ తో పెట్టుకున్న పేరులా ఉంది. ఒక అభిరుచి ఉంటేనే తప్ప ఇలాంటి రేర్ నేమ్స్ పెట్టడం జరగదు, మరి అంతటి అభిరుచి ఎవరికి ఉంటుంది. అకీరానందన్ తండ్రి పవన్ కళ్యాణ్ కాబట్టే ఉంటుంది. పవన్ ఎన్నో పుస్తకాలు చదివారు, చాలా మంది ప్రభావం ఆయన మీద ఉంది. దాంతో కుమారుడికి ఆయన అకీరానందన్ అని పేరు పెట్టాడు.

IHG's Special Looks

ఇదిలా ఉండగా అకీరానందన్ వయసు ఇపుడు పదహారు. టీనేజ్ బాయ్. స్మార్ట్ గయ్. పూణేలో కాలేజీ కుర్రోడిగా ఉన్నాడు. పొడుగు చూస్తే టాప్ రేంజి. మరి తండ్రి పవన్ కళ్యాణ్ పేరుని నిలబెట్టేలా సినిమా హీరో అవుతాడని ఫ్యాన్స్ అతను పొడువూ చార్మింగ్ ఫేస్ చూసి అనుకుంటున్నారు.

IHG

ఈ మధ్యనే అకీరానందన్ బర్త్ డే జరిగితే సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేశాడు. అకీరానందన్ హీరోగా రావాలని కూడా అంతా కోరుకున్నారు. అయితే అకీరా ఆలోచనలు ఏంటి అన్నది అతనైతే వ్యక్తంపరచడు. కానీ అతని తల్లి రేణూ దేశాయ్ మాత్రం అకీరానందన్ హీరో అవుతాను అంటే నేను ఫుల్ సపోర్ట్ అంటున్నారు.

IHG

అయితే సినిమా నటుడిగా పాషన్ తో రావాలి తప్ప ఎవరినో అనుసరించడానికి తన వారు అక్కడ ఉన్నారని కానీ రావడం అంటే తనకు ఇష్టంలేదని చెప్పుకొచ్చారు. అకీరానందన్ వయసు ఇంకా 16 ఏళ్ళే. కాబట్టి అతని ఫ్యూచర్ ఎలా ఉండాలో అతనే నిర్ణయించుకునే రోజు నేను సపోర్ట్ చేస్తానని రేణూ దేశాయ్ హామీ ఇచ్చేశారు.

IHG

సో అకీరానందన్ ఫ్యూచర్ మెగా హీరో అనుకోవచ్చు అన్న మాట. నిజంగా  మరో నాలుగేళ్లకు అకీరానందన్ 20 ఏళ్ల వాడు అవుతాడు. అపుడు సరిగ్గా అతను హీరోగా అందుకు వస్తాడని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: