గత కొన్ని రోజులుగా రేణు దేశాయ్ తన పిల్లలైనా అకీరా నందన్, ఆద్య లకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాలలో తరచూ షేర్ చేస్తుంది. అలాగే తన కొడుకు అకీరా చాలా సైలెంట్ అని... ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడడని చెప్పుకొచ్చింది. కానీ తన కుమార్తె ఆద్య మాత్రం చాలా చురుకు అని, బాగా మాట్లాడుతుందని తెలిపింది. ఇటీవల యాంకర్ ఉదయభాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని టేకప్ చేసిన రేణు దేశాయ్ మొక్కలు నాటడం లో తన కూతురి సహాయం తీసుకుంది. అలాగే ఈ ఛాలెంజ్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. మరుసటి రోజు తన ఇంట్లో పెరుగుతున్న 2 పిల్లుల ఫోటోలను షేర్ చేసి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.
తాను షేర్ చేసిన ఫోటోలో ఉన్న రెండు పిల్లులు ఒక ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయాయని... ఐతే జంతు సంరక్షణ కేంద్రం లో వాటిని చూసిన ఆద్య ఎంతగానో ఆసక్తి చూపిందని... తదనంతరం వాటిని ఆమెతో పాటే ఇంటికి తీసుకోచ్చిందని రేణు దేశాయ్ వెల్లడించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పిల్లుల బాగోగులు ఆద్య చూసుకుంటుందని రేణు దేశాయ్ తెలిపింది. చిన్న వయసులోనే ఆద్య జంతువుల పట్ల ఎంతగానో వాత్సల్యం చూపిస్తుండడం తో అభిమానులంతా తండ్రికి తగ్గ కూతురు అని కామెంట్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా మూగజీవుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తాడు.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి