సినీ ఇండస్ట్రీలో నటీనటులందరికీ ఫ్రైడే ఫోబియా ఉంటుంది. తమ సినిమాలు విడుదలయ్యేరోజు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. దర్శక నిర్మాతలు కూడా ఇందుకు అతీతులేం కాదు. నటీనటులు తొలిరోజు తమ బొమ్మ తెరపై పడిన తర్వాత ప్రేక్షకులనుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయాన్నే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కెరీర్ తొలినాళ్లలో ఈ క్యూరియాసిటీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్నే సినిమావాళ్ల భాషలో ఫ్రైడే ఫోబియా అంటారు.
హీరోయిన్ పూజా హెగ్డేకి కూడా ఈ ఫ్రైడే ఫోబియా ఎక్కువగా ఉండేదట. కెరీర్ మొదట్లో తన
సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంతో టెన్షన్ పడేదట పూజా.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో
పూజా తన ఫ్రైడే ఫోబియాని ఇలా బైటపెట్టింది. "సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలిరోజుల్లో శుక్రవారం వస్తుందంటే నటీనటులు ఒత్తిడికి గురవుతుంటారు. ఎందుకంటే సినిమావాళ్ల జాతకాలు ఆ రోజుతోనే ముడిపడి ఉంటాయి కదా, నేను కూడా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో అలాంటి ఒత్తిడినే అనుభవించా. నా
సినిమా థియేటర్లోకి వచ్చే సమయంలో ఫలితం కోసం అందరిలాగే ఉత్కంఠగా ఎదురు చూసేదాన్ని.
సినిమా రిలీజ్ ముందురోజు నాకు సరిగా నిద్రపట్టేది కూడా కాదు, ఎవరినుంచి
ఫోన్ వస్తుంది, రిజల్ట్ గురించి ఎవరు ఏం చెప్తారు అని టెన్షన్ పడేదాన్ని, కానీ రాను రాను నా ఒత్తిడిని నియంత్రించుకున్నా. అప్పటిలా ఇప్పుడు టెన్షన్ పడటంలేదు. ఏం జరిగినా మన మంచికే అని ఆలోచిస్తున్నా.
సక్సెస్ వస్తే నా కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అనుకుంటున్నా, రాకపోతే నా తప్పేమైనా ఉందా అని బేరీజు వేసుకుని ముందు కెళ్తున్నా" అని చెప్పింది పూజా.

ప్రస్తుతం ఈ అమ్మడు వరుస హిట్లతో దూసుకెళ్తోంది. అలవైకుంఠపురంలో
జోష్ తర్వాత
పూజా హెగ్డే డిమాండ్ అమాంతం పెరిగింది.
ప్రభాస్ రాధేశ్యామ్ లో
హీరోయిన్ గా నటిస్తున్న
పూజా,
మహేష్ బాబుతో మరో
సినిమా చేస్తోంది.
అఖిల్ సరసన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రిలీజ్ కు ముస్తాబవుతోంది. అటు
బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ స్టేజ్ లో ఇక పూజాకి ఫ్రైడే పీవర్ ఎందుకుంటుంది చెప్పండి.