డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటేనే మాస్ మసాలాకు పెట్టింది పేరు. హీరోను మాస్ గా చూపించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య, ఆయన హీరోలంతా మాస్ హీరోలే.. ఒక  ఇడియట్.. ఒక పోకిరి.. ఒక ఇస్మార్ట్ శంకర్.. ఇలా ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఎన్నో.. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ మ్యూజింగ్స్ పేరుతో తన ఆలోచనలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మ్యూజింగ్స్ రూపంలో బాగా పాపులర్ అయ్యాయి.


అయితే తాజాగా ఆయన ఎంచుకున్న సబ్జక్ట్.. కామ సూత్ర.  దానిపై ఆయన అభిప్రాయాలు షాకింగ్ గా ఉన్నాయి. ఇప్పటికీ మన సమాజంలో సెక్స్ ను అందరూ కలసి మాట్లాడుకునే సబ్జక్ట్ గా చూడటం లేదు. ఇప్పటికీ అది ఓ రహస్య కార్యకలాపంగానే ఉంటోంది. అయితే అసలు మన పూర్వీకులు ప్రపంచానికే సెక్స్ నేర్పారంటున్నాడు పూరీ.


ఆయన ఏమన్నాడో.. ఆయన మాటల్లోనే..     " కామసూత్ర.. ఈ పేరు వినగానే మనలో కోటి వీణలు మోగుతాయి. కామం అంటే అంత ఇష్టం మనకు. కామసూత్ర చదువుకుని సెక్స్ ప్రారంభించమని మనకు పూర్వీకులు చెప్పారు. కానీ మనం ముందు సెక్స్ మొదలు పెట్టేసి ఆ తర్వాత మధ్య ఎక్కడైనా కామసూత్ర బుక్ కనిపిస్తే ఆశగా కొన్ని బొమ్మలు చూస్తాం.. అర్రెర్రె చాలా యాంగిల్స్ మిగిలిపోయాయే అని బాధపడతాం.


అందరూ లైఫ్‌లో నాలుగు గోల్స్ సాధించాలి. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. కామ సూత్రలో స్త్రీ-పురుషుల సెక్స్, గే సెక్స్, లెస్బియన్ సెక్స్, గ్రూప్ సెక్స్.. అసలు మన పూర్వీకులు చేయంది అంటూ ఏదీ లేదు.. చివరకు జంతువులతో సెక్స్ చేశారు. ఇవన్నీ మనం మన గుడులపై శిల్పాలుగా చూడొచ్చు.  మన ఖజురహో.. కోణార్క్ వంటి గుడులపై ఆ బొమ్మలు చూస్తే.. అసలు మనం ఏమీ చేయనట్టే లెక్క..


ఆ గుడులపై బొమ్మలు చెప్పేదేంటంటే.. మీ కామ వాంఛలు ఎన్ని ఉంటే.. అవన్నీ తీర్చుకుని గుళ్లోకి రా అని చెబుతున్నాయి. ఆ తర్వాత కామాన్ని వదిలేయ్..  అప్పుడు గుడిలోకి రా.. అప్పుడే మోక్షం.. అన్ని కోరికలు తీర్చుకుని.. అన్ని పర్వర్షన్స్ తీర్చుకుని గుడికి రా ప్రశాంతంగా ఉండు.. “


మరింత సమాచారం తెలుసుకోండి: