‘ఆచార్య’ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినా ఇండస్ట్రీలో ఇప్పుడు కొనసాగుతున్నది మెగా కాంపౌండ్ ఆదిపత్యమే అన్నవిషయం మరొకసారి రుజువైనట్లు అనిపిస్తోందని కొందరు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ అసోసియేషన్ అదేవిధంగా రైటర్స్ అసోసియేషన్ ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాలు మెగా కాంపౌండ్ కనుసన్నలలోనే కొనసాగుతున్నాయి అన్న విషయం మరొకసారి ‘ఆచార్య’ వివాదం తెలియచేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


ఈ వివాదంలో మైత్రీ మూవీస్ కూడ తనవంతు పాత్రను నిర్వర్తిస్తూ డైరెక్టర్ రాజేష్ చెప్పిన కథ తమకు నచ్చకపోవడంతో తిరస్కరించాము అని ఓపెన్ గా చెప్పి రాజేష్ కథలో చెప్పుకోతగ్గ విషయం లేదు అన్నవిషయాన్ని పరోక్షంగా తెలియచేసారు. దీనితో మైత్రీ మూవీస్ కూడ మెగా కాంపౌండ్ ప్రాపకాన్ని కోరుకుంటోందా అన్న సందేహాలు ఇండస్ట్రీలోని ఒక వర్గానికి కలుగుతున్నాయి.


ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా మైత్రీ మూవీస్ ప్రస్తుతం ఏకంగా ముగ్గురు టాప్ మెగా హీరోలతో సినిమాలు తీయబోతు ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ‘పుష్ప’ మూవీని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి అంతా రెడీ చేసిన మైత్రీ మూవీస్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో మొదలుపెట్టబోయే సినిమాకు గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేసింది. ఇది చాలదు అన్నట్లుగా చిరంజీవి బాబీల కాంబినేషన్ లో మూవీ తీయడానికి కూడ మైత్రీ మూవీస్ రంగం సిద్ధం చేసుకుంటోంది.


దీనితో మైత్రీ మూవీస్ పెట్టుబడులు మెగా ఫ్యామిలీ హీరోల పై వందల కోట్ల స్థాయిలో ఉండబోతోంది. ఇలా ఒక నిర్మాణ సంస్థ మెగా హీరోల పై వందల కోట్లల్లో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని అయోమయ పరిస్థితి. ఒకవేళ ఓపెన్ అయినా టాప్ హీరోల సినిమాలకు గతంలోలా రికార్డుల కలక్షన్స్ వస్తాయా రావా అన్నది సమాధానం లేని ప్రశ్న. ఇలాంటి పరిస్థితులలో కూడ మైత్రీ మూవీస్ సంస్థ మెగా హీరోలను నమ్ముకుని వందల కోట్లల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్దపడుతు ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: