బాలు గారు ఇక లేరు అనే వార్త యావత్ ప్రపంచంలో బ్రతికి వున్న కొన్ని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఇటువంటి సమయంలో ఆయన జీవితం మీద ఎవరొకరు సినిమా తీస్తారని కొందరు ఊహించారు. కాని ఇంత త్వరగా సినిమా ప్రకటన వస్తుందని అనుకోలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం మీద సినిమా తియ్యాలని వుందని ‘తమిళ పదం వన్’,‘తమిళ పదం టూ’ సినిమాల డైరెక్టర్ సి.ఎస్. అముధన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అయితే, కేవలం బాలు మీద మాత్రమే ఆయన సినిమా తియ్యాలని వుందని చెప్పలేదు. బాలుతో సహా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా, డైరెక్టర్ భారతీరాజా బాండింగ్ మీద సినిమా తియ్యాలని వుందని చెప్పాడు. గాయకుడిగా బాలు షోలు చేస్తున్నప్పుడు ఇళయరాజాకు ఆయన తన మ్యూజిక్ ట్రూపులో అవకాశం ఇచ్చారు. సంగీత దర్శకుడిగా ఉన్నత శిఖరాలకు ఇళయరాజా ఎదిగిన తరవాత స్నేహితుడు బాలుతో ఎన్నో పాటలు పాడించారు.ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. భారతీరాజాకి కూడా వీళ్ళతో బాండింగ్ వుంది. గొప్ప గాయకుడు, గొప్ప సంగీత దర్శకుడు, గొప్ప దర్శకుడిగా ఎదిగిన ముగ్గురు స్నేహితులు స్ట్రగులింగ్ పీరియడ్ లో ఎలా వున్నారు? ముగ్గురు కలిసి ఎలా ఎదిగారు? అన్నది చెప్పాలని అనుకుంటున్నట్టు సి.ఎస్. అముధన్ తెలియజేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి