పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అటువంటి పవర్ స్టార్ మరో సినిమా తో వస్తున్నాడంటే  పండగే. ఇది ఇలా ఉంటే సినిమాని ప్రమోట్ చేయడంలో, మార్కెట్ చేయడంలో దిల్ రాజు దిట్ట అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ లాంటి సినిమా దిల్ రాజు భారీ సక్సస్ అవడానికి కారణమయ్యాడు. దిల్ రాజు ఇలా ప్రమోట్ చెయ్యడం సక్సెస్ అందుకోవడం అనేక మార్లు చూసాం.

అంతే కాదు దిల్ రాజు స్టైల్ ఎలా ఉంటుందంటే.... ఒక సినిమా లాస్ అయినా మీకు నేనున్నా అంటూ భరోసా ఇస్తుంటాడు. అలానే  అందరి కష్టాలను పంచుకుంటుంటాడు.  టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగుతున్న దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎంతగానో తపించాడు. తన కల ఇప్పటికి వకీల్ సాబ్ తో తీర్చుకున్నాడు. ఈ సినిమా విషయానికి వస్తే.... ఇప్పటికే  సినిమా టాకీపార్ట్ దాదాపు కంప్లీటయింది.  ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలని దిల్ రాజు కి పవన్ కళ్యాణ్ సూచించాడట.

ఇలా  కొత్త రకమైన పోస్టర్స్ ని రిలీజ్ చేయమని ప్లాన్ చేస్తున్నారు.  కొత్త రికార్డ్స్ సృష్టించాలని అటు పవర్ స్టార్ ఇటు నిర్మాత దిల్ రాజు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఖుషి, తొలి ప్రేమ, గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమాల రీతిలో ఉండబోతోందా అన్నది ఇప్పటికి ప్రశ్నార్ధకమే. ఈ పండుగకి  టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతే కాదు ఇక లిరికల్ సాంగ్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చెయ్యడానికి కూడ సిద్ధం అయ్యారట. సినిమా అంతా పూర్తై అంత ఒకే అయితే ఈ  సంక్రాంతి కి  వకీల్ సాబ్ ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: