కరోనా సెగలు ఇంకా తొలగిపోలేదు. అయినా.. వ్యవస్థలు గాడిలో పడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా మెల్లమెల్లగా కుదురుకుంటోంది. సినిమా షూటింగ్స్ హడావిడి ప్రారంభమైంది. ధియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. ప్రతి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా.. కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో కరోనా పంజా విసిరిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో టీమ్ షూటింగ్ కు గ్యాప్ ఇచ్చేసిందని కూడా అంటున్నారు.


టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా సక్సెస్ ట్రాక్ ఉన్న యువ హీరో సినిమా షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. వరుసగా రెండు సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన యువ దర్శకుడు ఈ సినిమాకు దర్శకుడు. హీరోకు, దర్శకుడి కాంబినేషన్లో ఇది రెండో సినిమా. దర్శకుడి తొలి సినిమా ఈ హీరోతోనే 2017లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు ఉన్నాయి. కరోనా గ్యాప్ తర్వాత ఇటివలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా 10 రోజుల షూటింగ్ జరుపుకుంది కూడా. అయితే.. షూటింగ్ లో ఒక వ్యక్తికి కరోనా సోకడంతో షూటింగ్ వాయిదా వేశారని తెలుస్తోంది.


ప్రస్తుతం హీరోతోపాటు టీమ్ అంతా షూటింగ్ క్యాన్సిల్ చేసి క్వారంటైన్ లోకి వెళ్లారని సమాచారం. షూటింగ్ ప్రారంభమైందని ఇటివలే సోషల్ మీడియాలో తెలిపాడు హీరో. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభమవుతున్న వేళ ఇండస్ట్రీకి ఇది షాక్ ఇచ్చే విషయమే. అయితే.. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. సీనియర్ హీరోలతోపాటు అనేక మంది సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. ఎన్నో జాగ్రత్తలతో షూటింగ్స్ జరుపుతున్నారు. ఇటువంటి సంఘటనలతో షూటింగ్ ప్రదేశాల్లో మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: