"సుధీర్ తో నాది ఏడేళ్ల అనుబంధం. ఈ ఏడాదితో మా ప్రయాణం ఎనిమిదో సంవత్సరంలోకి  అడుగుపెడుతోంది. అయితే ఏదో ఒక సమయంలో మనకి బయట స్నేహితులకంటే ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులే బాగా క్లోజ్‌ అవుతారు. మేమిద్దరం పరస్పరం ఒకరినొకరం అర్థం చేసుకోగలిగాం. మా ఇద్దరి గురించి ఏమైనా చెప్పాలంటే.. ప్రతి రిలేషన్‌షిప్‌కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని రిలేషన్‌షిప్‌లు అంతే..!" అని క్లారిటీ ఇచ్చారు రష్మి.  
జబర్దస్త్ లో టీమ్ లీడర్, యాంకర్ గా మొదలైన సుధీర్, రష్మి జర్నీ.. ఆ తర్వాత ఢీ ప్రోగ్రామ్ తో మరింత స్ట్రాంగ్ అయింది. ఢీ కార్యక్రమంలో రష్మి, సుధీర్ పాటలు.. వారి మధ్య ఏదో జరుగుతోందనే సంకేతాన్నిచ్చాయి. బుల్లితెరపై హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సుధీర్, రష్మి లవ్ లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని కూడా చాలా పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లు వస్తూనే ఉన్నాయి కానీ, వారిద్దరూ మాత్రం ఎప్పటిలాగే మంచి స్నేహితుల్లా కలసి షోలు చేసుకుంటూ వచ్చారు. ఒకరకంగా ఈ పుకార్లే వారికి మరింత పబ్లిసిటీ తెచ్చాయి, ఇద్దరూ  హిట్ పెయిర్ అయ్యేలా చేశాయి.
గతంలో చాలా సార్లు సుధీర్ తో తన రిలేషన్ పై స్పందించిన రష్మి.. జబర్దస్త్ 300 ఎపిసోడ్ లో అడుగుపెట్టిన సందర్భంగా మరోసారి స్టేజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా వారి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ గురించి చెప్పాలంటూ సుధీర్‌-రష్మిలను అభిమానుల తరఫు నుంచి రోజా కోరారు. రోజా అడిగిన ప్రశ్నతో సిగ్గుపడిన ఈ జంట అనంతరం తమ మధ్య ఉన్న అనుబంధం గురించి స్పందించారు. ‘ఏడేళ్ల నుంచి మనందరం కలిసి ప్రయాణిస్తున్నాం. మనందరం ఒక ఫ్యామిలీ. అనుకోకుండా మా ఇద్దరి గురించి ఒక ట్రాక్‌ స్టార్ట్‌ అయ్యింది. అది అలా కొనసాగుతోంది. ఆన్ స్క్రీన్ లో నాకు ఏదైనా పేరు వచ్చిందంటే దానికి ఒక కారణం రష్మి. సుధీర్‌-రష్మి అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు కానీ ఎనిమిదేళ్లుగా నా విజయం నా పక్కనే ఉంది. థ్యాంక్యూ సో మచ్‌ రష్మి’ అని సుధీర్‌ చెప్పగా.. రష్మి కూడా వెంటనే స్పందించింది. ప్రతి రిలేషన్‌షిప్‌కి పేరు పెట్టాల్సిన అవసరం లేదని. కొన్ని రిలేషన్‌షిప్‌లు అంతేనని తేల్చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: