తెలుగు అగ్ర హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు..అయితే ప్రస్తుతం మహేష్ బాబు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల సంక్రాంతికి విడుదల అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. మహేష్ సినిమాలలోనే కాదు యాడ్ లలో కూడా తన స్టయిల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు.



అసలు విషయానికొస్తే.. మహేష్ బాబు యాడ్ లను కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పటి వరకు చేసిన యాడ్ లలో క్లోజప్, తంసప్ యాడ్ లు బాగా పాపులర్ అయ్యాయి. దాంతో ఆ బ్రాండ్స్ కు కూడా మంచి పేరు వచ్చింది..ఇటీవల బిల్డింగ్ సంబందించిన యాడ్ లో ఫ్యామిలీ మొత్తం నటించారు. అది కూడా మహేష్ అభిమానుల చూపును మరింత ఆకట్టుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యాడ్ లు మహేష్ బాబు స్థాయిని పదిరెట్లు ఎక్కువ పెంచాయని చెప్పాలి.



ఇప్పుడు మరో యాడ్ లో నటిస్తున్నాడు. కార్‌దేఖో గాడి మొబైల్ యాప్ ద్వారా హోం ఇన్‌స్పెక్షన్‌ను బుక్ చేసుకోవచ్చు. కార్‌దేఖో నుంచి ఒక ప్రొఫెషనల్ వినియోగదారుడి ఇంటికి వచ్చి కారును పరీక్షించి సర్టిఫై చేస్తాడు. దీంతో మంచి ధరకు ఇంటి వద్దే వినియోగదారుడు కారును విక్రయించొచ్చు. అంతేకాదు, ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ను కూడా ఉచితంగానే అందిస్తోంది కార్‌దేఖో. అంటూ వచ్చిన యాడ్ లో మహేష్ చాలా బాగా నటించాడు. ఆ యాడ్ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..ఈ యాడ్ తో మహేష్ బాబు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు అని భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.. వచ్చే ఏడాది విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: