తెలుగు అగ్ర హీరోలలో ఒకరు రెబల్ స్టార్ ప్రభాస్.. కృష్ణం రాజు వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఈ హీరో.. ఒక్కో సినిమా తో స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. బాహుబలి సినిమా తో వరల్డ్ ఫేమస్ హీరో అయ్యాడు. అతని మంచి తనం, నటన ఇవన్నీ కూడా ప్రభాస్ స్థాయిని పదిరెట్లు పెంచాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్ పేరు ప్రపంచ స్థాయిలో మారు మోగుతుంది. అందుకే అందరికీ డార్లింగ్ అయ్యాడు. ఎనలేని అభిమానులను సంపాదించుకున్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్..



ఇకపోతే ప్రభాస్ ప్రజలను ఆదుకోవడంలో ముందుంటాడు..అది అందరికీ తెలిసిందే.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవడానికి భారీ విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గిరిజన ప్రాంతం తో గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు భారీ ఆస్తి,ప్రాణ నష్టం కలిగింది.



ఇంకా వరుణిదేవుడి ఆగ్రహం చల్ల బడలేదు.. వర్షాలు పడుతూనే ఉన్నాయి..భారీ వర్షాలు, వరదలు కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకొనేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మొదటిగా నందమూరి బాలకృష్ణ రూ.1.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.. కాగా, నిన్న తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు, ప్రముఖులు విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు.



ఈ మేరకు ప్రిన్స్ మహేష్ కోటి, చిరంజీవి కోటి,ఎన్టీఆర్ 59 లక్షలు, నాగార్జున 50 లక్షలు, విజయ్ దేవరకొండ 10,రవితేజ రూ.10 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్-నిర్మాత ఎస్.రాధాకృష్ణ లు కలిసి 10 లక్షలు ఇచ్చారు. వీళ్ళు కాక చాలా మంది హీరోలు భాదితులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కోటి రూపాయల విరాళాన్ని వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఈ వార్త బయటకు పొక్కడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.. ప్రస్తుతం ప్రభాస్ రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: