టాలీవుడ్ చందమామ కాజల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతోంది. ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న వివాహం చేసుకుంటోంది. సినిమాల్లో నటిస్తూనే ఆమె పెళ్లి చేసుకోవడం.. అనంతరం కూడా సినిమాలు చేస్తానని ప్రకటించడం అభిమానులను సంతోషపరిచే విషయం. చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో ఈ వివాహం జరుగబోతోంది. టాలీవుడ్ నుంచి ఆమె పెళ్లికి ఆహ్వానం అందుకున్న అతితక్కువ మందిలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు. దీంతో వీరిపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.
‘కాజల్ చాలా అదృష్టవంతురాలు. చాలా మంచి వ్యక్తి ఆమెకు జీవిత భాగస్వామిగా రాబోతున్నాడు. కాజల్ మా ఇంట్లోని వ్యక్తితో సమానం. గౌతమ్ కిచ్లు చాలా ఉన్నతమైన వ్యక్తి. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో ఉన్నాను. ఎన్ని పనులున్నా ఆపుకుని ఆమె పెళ్లికి హాజరవుతాను. నా పనుల కోసం కాజల్ పెళ్లికి వెళ్లకుండా ఉండను. వారిద్దరికీ ముందుగా నా శుభాకాంక్షలు’ అంటూ కాజల్ అంటే తనకెంత గౌరవమో తన మాటల ద్వారా చెప్పుకొచ్చాడు. కాజల్ పెళ్లికి ఆహ్వానం అందిన టాలీవుడ్ సెలబ్రిటీల్లో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు తప్పించి పెద్దగా ఎవరి పేరూ వినిపించలేదు.


బెల్లంకొండ శ్రీనివాస్కాజల్ కలిసి కవచం, సీత సినిమాల్లో నటించారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి చెప్తూ.. ‘మంచి ఎంటర్ టైన్మెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏడు నెలల తర్వాత షూటింగ్ లో పాల్గొనడం కొత్తగా ఉంది. ఈ సినిమా కోసం విభిన్నమైన లుక్ ట్రై చేశా. ఖచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని చెప్పుకొచ్చాడు. కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’.. తమిళ్ లో కమల్ హాసన్ తో భారతీయుడు2 సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: