తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి.. కొత్త ప్రయోగాలతో సినిమాలు తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. చాలా కాల వ్యవధితో సినిమాలు చేసినా కూడా అవన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను అందుకోవడం వంటి వాటిని చవి చూస్తాయి. ఆయన ఇప్పటివరకు తీసిన వాటిలో ఇది బాగాలేదు అని చెప్పలేము.. అన్నీ సినిమాలు సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. 



ఆయన సినిమాల విషయానికొస్తే.. మగధీర, ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 వంటి సినిమాలు భారీగా ప్రజాదారణ పొందాయి. బాహుబలి సినిమాలు మాత్రం హిట్ అవ్వడంతో పాటుగా దేశ విదేశాల్లో కూడా ఎనలేని ఆదరణను సంపాదించుకున్నారు. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా వచ్చి కూడా చాలా కాలం అయ్యింది. ఇప్పటికీ జక్కన్న మరో సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు. ప్రస్తుతం జక్కన్న మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమానే ఆర్ ఆర్ ఆర్.. 



ఈ సినిమాలో తారక్ , రామ్ చరణ్ హీరోలు గా నటిస్తున్నారు.. సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా, ఈ చిత్రం నుంచి తాజాగా ఎన్టీఆర్ కు సంబందించిన టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ పై చరిత్ర ప్రేమికులు మండిపడ్డారు. బాహుబలి లాంటి సినిమాలు నువ్వు కొత్తగా చూపించిన బాగుంటుంది.. కానీ చరిత్రను తిరగరాసే హక్కు నీకు లేదు. అందరికీ తెలిసిన స్టోరీని నీ ఇష్టం వచ్చినట్లు రాస్తావా అంటూ మండి పడుతున్నారు. సినీ అభిమానులు తమ అభిమాన హీరో ఏం చేసినా కూడా అది కరెక్ట్ అనుకుంటారు. కానీ చరిత్ర లో గొప్ప స్థానాన్ని అందుకున్న వ్యక్తుల పై ఇలా చేయడం తప్పు అంటూ ప్రజలు రగిలి పోతున్నారు.. మరి ఈ విషయం పై జక్కన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: