విజయ్ సేతుపతిపై ఇప్పుడు తమిళులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ నుంచి సేతుపతి తప్పుకున్నా, ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ఎల్.టి.టి.ఈ. ప్రభాకరన్‌ని ముత్తయ్య వ్యతిరేకించాడనే విమర్శలున్నాయి. అలాంటి ముత్తయ్య కథకి సైన్ చేసి సేతుపతి తమిళుల గౌరవాన్ని దెబ్బతీశాడని విమర్శిస్తున్నారు. ఇప్పుడీ విమర్శల నుంచి బయటపడ్డానికి ఎల్.టి.టి.ఈ.ప్రభాకరన్‌లా మారుతున్నాడట సేతుపతి.
ఎల్.టి.టి.ఈ. ప్రభాకరన్‌ని తమిళులు ఇప్పటికీ హీరోలా చూస్తున్నారు. ప్రభాకరన్ చనిపోయి దశాబ్దం దాటినా అభిమానం మాత్రం తగ్గలేదు. అందుకే ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. వీరప్పన్, రాజీవ్ గాంధీ హత్యోదంతాలపై సినిమాలు తీసిన డైరెక్టర్ ఎ.ఎమ్.ఆర్.రమేశ్, ప్రభాకరన్ లైఫ్‌పై ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నాడు.ఇక ప్రభాకరన్ క్యారెక్టర్‌కి సేతుపతిని కాంటాక్ట్ చేశాడట రమేశ్.
ప్రభాకరన్‌పై అభిమానంతోనే విజయ్ సేతుపతిని తమిళ ద్రోహి అని విమర్శించారు జనాలు. అదే ప్రభాకరన్ క్యారెక్టర్ చేస్తే జనాలు మళ్లీ నన్ను హీరోలా చూస్తారని అనుకుంటున్నాడట విజయ్. అందుకే ప్రభాకరన్‌లా మారడానికి ఈ హీరో ఆసక్తి చూపిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
విజయ్ సేతుపతిపై తమిళనాట ఆగ్రహాలు పెల్లుబుకుతున్నాయి. ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమా నుంచి ఆయన తప్పుకున్నా కూడా విజయ్ సేతుపతిపై ఓ రెంజ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ప్రభాకరన్ ని ముత్తయ్య వ్యతిరేకించాడనే ఆరోపణలు రావడంతోనే ఈ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముత్తయ్య మురళీధరన్ తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడని ఆయనపై గుర్రుగా ఉన్నారు తమిళులు. అందుకే ఈ గొడవను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. అంతేకాదు ప్రభాకరన్ జీవితంపై కూడా ఓ వెబ్ సిరీస్ వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి