మహేష్ బాబు హీరోగా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట.  14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో తొలిసారిగా మహేష్ బాబు కు జోడిగా కీర్తి సురేష్  నటిస్తుండగా యువ సంగీత తరంగం తమన్ సంగీతాన్ని, మది ఫొటోగ్రఫీ అందించనున్నారు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతిత్వరలో అమెరికాలో ప్రారంభం కాబోతోంది.

ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన రావడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు పరశురామ్ సహా మరికొంత మంది మూవీ యూనిట్ సభ్యులు ఇటీవల అమెరికా వెళ్లి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ని నవంబర్ నెల మొదటి వారంలో ప్రారంభించాలని దర్శకనిర్మాతలు భావించినప్పటికీ ప్రస్తుతం అమెరికాలో అంతకంతకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం సరైనది కాదని భావించి జనవరి నెల మొదటి వారానికి షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ రెండు నెలలు సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాళీగా ఉండనున్నారని అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే మహేష్ బాబు తో ఓ సినిమా చేయడానికి సిద్ధమైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభించనున్నారని అంటున్నారు.

హారిక హాసిని క్రియేషన్స్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని సంయుక్తంగా ఎంతో ఖర్చుతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయనున్నప్పటికీ మరోవైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగులో బిజీగా ఉండటం, అలానే ఇటు మహేష్ బాబు ఖాళీగా ఉండటంతో వీలైనంత త్వరగా ఆయనతో సినిమాను మొదలు పెట్టేలా పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారట త్రివిక్రమ్. కాగా అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా బయటికి రానుందని అన్నీ అనుకున్నట్లు జరిగితే అత్యంత వేగవంతంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా కూడా భావిస్తున్నాడట త్రివిక్రమ్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: