టాలీవుడ్‌ ఈ ఏడాది పండగ అన్న మాటనే మరిచిపోతోంది. ఫెస్టివల్‌ మూవీస్‌ అనే ఆలోచనని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకుంటోంది. ఆల్రెడీ కరోనా ప్రభావంతో సమ్మర్‌ని మిస్‌ చేసుకున్న టాలీవుడ్, ఇప్పుడు దసరాని వదిలేసుకున్నట్టే. ఇక  దీపావళిని కూడా వదిలేసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి ఈ ఏడాది కేవలం సంక్రాంతి హిట్స్‌తోనే ఈ ఏడాదిని ముగించాలనుకుంటోందన్న మాట మన తెలుగు ఇండస్ట్రీ. మామూలుగా అయితే దసరా, దీపావళి పండగలొస్తున్నాయంటే టాలీవుడ్‌కి ఎక్కడలేని ఎనర్జీ వచ్చేది. ఎందుకంటే ఈ రెండు సీజన్స్ లో కూడా కొత్త సినిమా రిలీజులతో థియేటర్లు కళకళలాడుతుండేవి.

కానీ ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడమే కష్టంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావం తగ్గే వరకు థియేటర్ల ఓపెనింగ్‌కి పర్మిషన్‌ ఇవ్వకపోవడమే మంచిది అనుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఇక నిర్మాతలు కూడా ఈ ఏడాది సినిమాలు రిలీజ్ చెయ్యకపోవడమే బెస్ట్ అనుకుంటున్నారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది కేంద్రం. అయితే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎగ్జిబిటర్లు కూడా సినిమా హాళ్లు తెరవడానికి ఆసక్తి చూపించట్లేదు.

 కరోనా ప్రభావం తగ్గేవరకు సినిమాలు రిలీజ్‌ చెయ్యకపోవడమే బెస్ట్‌ అనుకుంటున్నారు నిర్మాతలు. దీంతో 2020కి సంక్రాంతి హిట్స్‌తోనే శుభం కార్డ్‌ పడుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో వేల కొద్దీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. జనాలు కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు సినిమా హాళ్లకు రావడం చాలా కష్టమని భావిస్తున్నారు నిర్మాతలు. ఈ ఏడాది సినిమాలు రిలీజ్‌ చేసినా నష్టాలే తప్ప మరో ప్రయోజనం ఉండదు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: