ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  
తెలుగులో ఎన్ని వెబ్ సిరీస్ లు విడుదలవుతున్నా.. ఇక్కడి ప్రేక్షకులందరూ ‘మీర్జాపూర్2’ వెబ్ సిరీస్ కోసమే ఎదురుచూస్తూ వచ్చారు. చెప్పుకోవడానికి ‘మీర్జాపూర్ సీజన్1’ కొత్త కథేమీ కాదు. కానీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే బోలెడంత బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ను అనేక భాషల్లో డబ్బింగ్ చేశారు. అయితే తెలుగులోనే బాగా హిట్ అయ్యింది. దానికి ప్రధాన కారణం.. ఈ వెబ్ సిరీస్ కు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా కుదరడం.. ఎక్కువ శాతం బూతులు ఉండడం.

నిజజీవితంలో జనాలు ఫ్రస్ట్రేషన్లో తిట్టే బూతుల సందర్భాలను.. ఇందులో చాలా బాగా చూపించారు. నిజానికి తెలుగులో ఇన్ని బూతులుంటాయా అనేంత అనుమానం కలిగే విధంగా ఈ వెబ్ సిరీస్లో డైలాగులు ఉంటాయి. ఇక సెకండ్ సీజన్ ను విడుదల చేస్తున్నారు అని నిర్మాతలు ప్రకటించగానే.. తెలుగు డబ్బింగ్ కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రేక్షకులు కామెంట్లు పెట్టారు. ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ ట్రైలర్ తెలుగులో విడుదల కాలేదు.

దాంతో ఈసారి తెలుగు వెర్షన్ ను విడుదల చెయ్యడం లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. తరువాత అక్టోబర్ 23న సెకండ్ సీజన్ ను విడుదల చేశారు. కానీ అందరూ అనుమానించినట్టుగానే తెలుగు డబ్బింగ్ లేదు.. హిందీలో మాత్రమే ఉంది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. కానీ బూతుల కోసం తెలుగు వెర్షన్ ను విడుదల చెయ్యాలంటూ వారు పరితపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి నిర్మాతలు వీరి మొరను ఎప్పుడు ఆలకించి కరుణిస్తారో..!

మరింత సమాచారం తెలుసుకోండి: