ఈ మధ్యకాలంలో సినిమాలకంటే సీరియళ్లకు ఎక్కువ మంది అభిమానులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. రెండున్నర గంటల పాటు వినోదాన్ని పంచే సినిమాల కంటే దాదాపు నెలలు సంవత్సరాల పాటు వినోదాన్ని పంచుతూ.. భావోద్వేగంలో ముంచెత్తే సీరియళ్లకు ఎక్కువ గా ఆకర్షితులవుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు.  ముఖ్యంగా మహిళలు అయితే తమ అభిమాన సీరియల్ వస్తుందంటే చాలు ఏ పని ఉన్నా పక్కన పడేసి టీవీలకు అతుక్కుపోతుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బుల్లితెర పై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఎంతో మంది అభిమానులను పెంచుకుంటూ దూసుకుపోతుంది కార్తీకదీపం సీరియల్.



 ఇక ఈ సీరియల్ కి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ సీరియల్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫన్నీ  మీమ్స్  కూడా వస్తూ ఉంటాయి. కార్తీకదీపం సీరియల్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు బుల్లితెర ప్రేక్షకులు అందరూ. సీరియల్ లో  వంటలక్క డాక్టర్ బాబు పాత్రలు  ఎంతో ఫేమస్ అయ్యాయి అనే చెప్పాలి. ఇక వంటలక్క ఏ ప్రోగ్రాం లో కనిపించిన భారీ రేటింగ్ను సొంతం చేసుకుంటూ ఉంటుంది ఆ షో. ఇకపోతే వంటలక్క క్రేజ్  కార్తీకదీపం సీరియల్ ద్వారా రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.



 ఇప్పటికే వంటలక్క పాత్రలో  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్.. సినిమాల్లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగు సినిమాల్లో నటించేందుకు మంచి అవకాశాన్ని దక్కించుకుంది వంటలక్క. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది  వంటలక్క. త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించబోతున్నాను  అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో వంటలక్క అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు అనే చెప్పాలి ఇంక వంటలక్క లేడీ ఓరియంటెడ్ సినిమా అనేసరికి ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: