కరోనా దెబ్బకు అన్నీ బంద్ అయ్యాయి. ఇప్పుడు జనాలు మళ్ళీ సామాన్య స్థితికి వస్తున్నారు. అయితే అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చినా ఇంకా సినిమా థియేటర్స్ కి మాత్రం పర్మిషన్స్ ఇవ్వలేదు. సినిమా థియేటర్లు ఈ నెల పదిహేను నుండి ఓపెన్ చేసుకోవచ్చని చెప్పినా తెరుస్తారో లేదో ఇప్పటికీ తెలీదు. దీంతో ఇప్పటికే సినిమాలు పూర్తి అయి రిలీజ్ కి రెడీ ఐన సినిమాలు, అలానే షూట్ పూర్తి కావోచ్చిన సినిమాలు తమ తమ సినిమాలని ఎప్పుడు ? ఎలా ? ఎందులో రిలీజ్ చేయాలో అని ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఒప్పుకున్న సినిమాల విషయంలో కూడా రకరకాల టెన్షన్ వెంటాడుతున్నాయి.

మరీ ముఖ్యంగా ఒక స్టార్ హీరోతో చేయాల్సిన సినిమాని ఏఎ కరోనా ఎఫెక్ట్ వలన వదులుకోవలసి వచ్చిందని అంటున్నారు. నిజానికి తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగారాజ్ తో మాస్టర్ అనే సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో సెట్ అయినా లాక్ డౌన్ కారణంగా మొదలుకాలేదు. ఇప్పుడు లాక్ డౌన్ లేకపోవడంతో సినిమాను స్టార్ట్ చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నా కొన్ని కారణాల వలన ఆయన సినిమా నుండి తప్పుకుంటున్నట్టు చెబుతున్నారు.

దానికి కరణం ఏమిటంటే ముందు చెప్పిన బడ్జెట్ కాకుండా కాస్త తగ్గించమని అడిగారట. కానీ మురుగదాస్ అందుకు ఒప్పుకోలేదని అంటున్నారు. అయితే అలా కాని పక్షంలో మురుగదాస్ డిమాండ్ చేసినంత పెద్ద రెమ్యునరేషన్ ఇవ్వలేమని, దానిని అయినా తగ్గించుకోమని కోరారట. కానీ మురుగదాస్ కాంప్రమైజ్ కాలేదట. అందుకే ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. చూడాలి మరి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: