బాలీవుడ్ నటి కరీనా కపూర్ గర్భిణి అన్న విషయం తెలిసిందే. తాను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఆగస్టులో ఆమె సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపింది. సైఫ్ అలీ ఖాన్.. కరీనా దంప‌తుల‌కు ఇప్పటికే తైమూర్ అనే కొడుకును ఉన్నాడు. తైమూర్ గురించి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

కరీనా కపూర్ రెండోసారి గర్బవతి అనే విషయం అధికారికంగా బయటకు రాగానే బాలీవుడ్ ప్రముఖులు తమ విషెస్‌తో ముంచెత్తారు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలంటూ పలువురు సన్నిహితులు జాగ్రత్తలు, సూచనలు చెప్పడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో కరీనా దంపతులుకు భారీగా శుభాకాంక్షలతో కూడిన మెసేజ్‌లు అందుతున్నాయి.

అయితే సాధారణంగా కొందరు హీరోయిన్లు గర్భిణిగా ఉన్న సమయంలో తమ ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తపడతారు. కరీనా కపూర్ మాత్రం ఇటువంటివి పట్టించుకోకుండా షూటింగ్‌లో పాల్గొంది. అంతేగాక, ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో తాజాగా ఆమె పాల్గొన్నట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె అక్క కరిష్మా కపూర్ కూడా ఆమె వెంటే ఉంది. కుర్చీలో కూర్చొని ఆమె హుషారుగా ఫొటోకు పోజులిచ్చింది.

కరోనా సీజన్ కావడంతో బయటకు రావడానికి మరింత భయపడతారు. కరీనా కపూర్ మాత్రం ఇటువంటివి పట్టించుకోకుండా షూటింగ్‌లో పాల్గొంది. అంతేగాక, ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో తాజాగా ఆమె పాల్గొన్నట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె అక్క కరిష్మా కపూర్ కూడా ఆమె వెంటే ఉంది. కుర్చీలో కూర్చొని ఆమె హుషారుగా ఫొటోకు ఫోజులిచ్చింది క‌రీనా. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: