టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా క్రాక్. బి మధు నిర్మాత గా సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జీకే విష్ణు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని, ఆలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అతి త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక తన కెరీర్ లో కొన్నాళ్ల నుండి వరుసగా పరాజయాలు అందుకుంటూ కొనసాగుతున్న మాస్ రాజా రవితేజ తప్పనిసరిగా ఈ సినిమాతో భారీ హిట్ కొట్టేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్. గతంలో తనతో డాన్ శీను, బలుపు వంటి హిట్ సినిమాలను తీసిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకు కూడా అద్భుతమైన రీతిలో కమర్షియల్ అంశాలు కలగలిపి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దీనిని తీస్తున్నాడని, రేపు రిలీజ్ తర్వాత తనకు ఈ సినిమాతో హిట్ ఖాయమని రవితేజ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట.

మరోవైపు ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ నేడు ముగిసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా కు సంబంధించి అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్. మొత్తంగా చూసుకుంటే మాస్ రాజా రవితేజ ఎప్పటి నుండో ఆశిస్తున్న విధంగా ఈ క్రాక్ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకని ఆయనకు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఆయన అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు మరి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: