మెగాస్టార్ తమ్ముడిగా తెలుగు చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు నాగబాబు. నాగబాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. కానీ నాగబాబు హీరోగా రాణించలేకపోవడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించాడు. ఇప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు.  నాగబాబు జబర్ధస్ట్ నుంచి దూరం అయ్యాడు.. ప్రసెంజ్ ‘బొమ్మ అదిరింది’ షోకి జడ్జిగా మెప్పిస్తున్నాడు.  సినిమా రంగంలో అడుగు పెట్టిన తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రోద్బలంతో నాగబాబు తన తల్లి అంజనాదేవి పేరుమీదుగా అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు.  

మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా రాణించారు. 1961 అక్టోబర్ 29 వ తేదీన నాగబాబు మొగల్తూరూలో జన్మించారు. ఈరోజు నాగబాబు పుట్టినరోజు. నాగబాబుకు నిహారిక, వరుణ్ తేజ్ ఇద్దరు సంతానం. ఇక చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాతో నాగబాబు నిర్మాతగా మారారు. 1988లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ తో త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, స్టాలిన్ సినిమాలు తీశారు. అంతేకాదు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా నాగబాబు గుడుంబా శంకర్ సినిమా నిర్మించారు.  ఈ సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. అయితే, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా నాగబాబుని భారీ నష్టాల్లోకి నెట్టేసింది. ఆరెంజ్ సినిమా తరువాత ఈ సంస్థ నుంచి మరో సినిమాను తెరక్కించలేదు.

ప్రస్తుతం నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు కామెడీ షోలకు జడ్జిగా  వ్యవహరిస్తున్నారు. ఇక రాజకీయంగానూ నాగబాబు అప్పట్లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చురుకైన పాత్రను పోషించారు.  ఇప్పుడు తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో కూడా అయన తనదైన పాత్రను పోషిస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: