బుల్లితెరపై బిగ్ బాస్ షో గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ షో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది. ఇక గత బిగ్ బాస్ సీజన్ 3లో బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ జోడీ ఎవరంటే రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం. హౌస్‌లో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉన్న వీళ్లు హౌస్ బయటకు వచ్చిన తరువాత కూడా ఒకరికోసం ఒకరు అన్నట్టుగానే తరచూ కలవడం.. కలిసే లైవ్‌ను నిర్వహించడం చేశారు. ఈ ఇద్దరి మధ్య బిగ్ బాస్ హౌస్‌లో సంథింగ్ సంథింగ్ నడుస్తుందంటూ హోస్ట్ నాగార్జునతో సహా బాగా ప్రమోట్ చేయడంతో పాటు ఈ ఇద్దరూ ముద్దులు, హగ్‌లతో బిగ్ బాస్ హౌస్‌లో బాగా వేడిపుట్టించారు.

అయితే బిగ్‌బాస్‌3` ఫేమ్‌, నటి పునర్నవి భూపాలం ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. యూట్యూబ్‌ పాపులర్‌ ఉద్భవ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయినట్టు తెలిసింది. అయితే మరికొన్ని విషయాలను శుక్రవారం వెల్లడిస్తామని పునర్నవి పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు మొత్తం షాక్‌ అయ్యారు. అయితే పునర్నవి, `బిగ్‌బాస్‌3` విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య లవ్‌ ఎఫైర్‌ ఉందని, వీరి త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

కానీ ఇప్పుడు పునర్నవి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దీనిపై పునర్నవి ప్రియుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. `నేను నా భయాలను మోసం చేశాను, నా సందేహాలు బ్రోక్‌ అయ్యాయి. నా విశ్వాసానికి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు నేను నా కలలను మ్యారేజ్‌ చేసుకున్నా` అని ఎమోషనల్‌గా పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో పెట్టుకున్నారు. దీంతో ఇది ఇప్పుడి సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతుంది. దీన్ని బట్టి రాహుల్‌ సిప్లిగంజ్‌ని పునర్నవి మోసం చేసిందనే విషయం చెప్పకనే చెప్పేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: