ఛలో సినిమాతో తెలుగింట అడుగుటపెట్టిన రష్మిక మందన్న...తొలిసినిమాతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తరువాత  గీతగోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఇప్పుడు అగ్ర హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ తో జత కట్టనుంది ఈ అందాల భామ. చాలామంది హీరోయిన్ల పేర్ల అనంతరం రష్మిక మందన్న... పుష్ప సినిమా లో హీరోయిన్ గా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి సినిమాకి తనను తాను మార్చుకుంటూ కథకు తగ్గట్టు తనను తానే మలచుకునే రష్మిక ఇప్పుడు ఈ సినిమాలో తన పాత్ర కోసం ముప్పతిప్పలు పడుతోందట.... మరి సుకుమార్ సినిమాలో హీరోయిన్ అంటే ఆషామాషీ విషయం కాదు మరి. తన సినిమాలలో హీరోకి ఎలా అయితే ఆదరణ లభిస్తుందో... హీరోయిన్లకు కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించేలా పాత్రని మలచడంలో దిట్ట మన దర్శకుడు సుకుమార్.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ గా, మొరటు కుర్రాడిగా కనిపించనున్నాడు. మాసిన దుస్తులు.. గుబురు గడ్డం.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్న బన్నీ ఫస్ట్ లుక్ చూస్తేనే ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఊహించగలరు.... అటు హీరోయిన్ గా చేసే రష్మిక పాత్ర కూడా ఇలాగే సరికొత్తగా ఉండబోతుందట. పుష్ప రాజ్ కి తగ్గట్టే రష్మిక పాత్ర  ట్రైబల్ యువతిగా కనిపిస్తూ చిత్తూరు యాసలో మాట్లాడనుందట.ఇప్పటివరకు క్యూట్ గా కనిపిస్తూ స్వీట్ స్వీట్ మాటలతో సినిమాలో అలరించిన రష్మిక.... ఇప్పుడు చిత్తూరు భాషలో మాట్లాడడం అంటే దానికి తగ్గ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా కీలకం... అందుకనే ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోందట.

ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న లుక్ చాలా సెక్సీగా ఉండబోతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం ఫుల్ బాడీ షేప్ లోకి రావడానికి ఈ హీరోయిన్ తెగ ట్రై చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ బాగా కష్టపడుతోంది. అంతేకాకుండా ఈ పాత్ర కోసం ఆమెకు సుకుమార్ స్పెషల్ గా వర్క్ షాప్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.  ఏదేమైనా ఈ సినిమా కోసం ఎంతో కష్ట పడుతూ గ్రేట్ అనిపించుకుంటోంది రష్మిక. మరి పుష్ప సినిమాలో రష్మిక మందన్న ఎలా తన నటనతో ఆకట్టుకోనున్నదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: