బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ గా ఉన్న అభిజిత్, అఖిల్ ల మధ్య రెండో వారం నుండి దూరం పెరిగింది. అభిజిత్, అఖిల్ ఇద్దరు మరో హౌజ్ మేట్ మోనాల్ కు దగ్గరవడం ఇద్దరు ఆమెని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అయితే మోనాల్ అఖిల్ కు ఎక్కువ క్లోజ్ అయ్యి అభిజిత్ కు దూరమైంది. అప్పటినుండి అఖిల్, అభిజిత్ ల మధ్య కూడ దూరం పెరిగింది.

ప్రతి వారం నామినేషన్స్ లో అభిజిత్ వర్సెస్ అఖిల్ గొడవ తెలిసిందే. అయితే లాస్ట్ వీక్ తో అభిజిత్, అఖిల్ వారి మధ్య ఉన్న సమస్యల గురించి మాట్లాడుకున్నారు. మోనాల్ కూడా అభిజిత్ తో ఉన్న తన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంది. శుక్రవారం ఎపిసోడ్ లో 55 రోజుల బిగ్ బాస్ జర్నీ చూపించగా అందులో అభిజిత్, మోనాల్.. అఖిల్, మోనాల్ రిలేషన్ పై స్పెషల్ ఫోకస్ చూపించారు. ఇదేదో ప్రేమదేశం కాన్సెప్ట్ లా అనిపించినా ఫైనల్ గా ఈవారం వారు ముగ్గురు కలిశారు.

అభిజిత్, అఖిల్ వేరు వేరుగా ఆట ఆడితే ఇలా ఉంటే ఇద్దరు కలిసి ఆట ఆడితే ఆట ఇంకా జోరుగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఆట మరింత రసవత్తరంగా సాగుతుంది అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎక్సాంపుల్. ఇప్పటివరకు జరిగిన గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు బిగ్ బాస్. ఇక మిగతా సగం రోజుల్లో ఎవరు ఎలా టర్న్ అవుతారు. ఎవరు తమ ఆటని మార్చుకుంటారన్నది చూడాలి.                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: