ఒకప్పుడు యూత్ ఫుల్ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని వరుస విజయాలతో దూసుకుపోయారు తరుణ్. తరుణ్ సినిమా వస్తుందంటే అటు ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉండేవి. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో  నటించిన తరుణ్ తన నటనతో కూడా ఎంతోమందిని ఆకర్షించాడు. అంతేకాకుండా అప్పట్లో యువతలో క్రేజ్ సంపాదించిన తరుణ్ కి ఎంతో మంది అమ్మాయిల మనుషులు కొల్లగొట్టాడు అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన తరుణ్ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో తెలుగు చిత్ర పరిశ్రమపై కనుమరుగైన విషయం తెలిసిందే.


 అప్పుడప్పుడు అడపా దడపా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తరుణ్ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో చివరికి తరుణ్ కు  మరిన్ని అవకాశాలు తగ్గిపోయి పూర్తిగా కనుమరుగై పోయాడు. అయితే గతంలో స్టార్  నటులుగా వెలిగి  కనుమరుగైన వారందరూ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు నేటి రోజుల్లో. నిన్నటి తరం హీరోయిన్లు కూడా ఎంతోమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక యూత్ ఫుల్ సార్ హీరోగా అప్పట్లో ఎన్నో ఏళ్ల పాటు హవా  నడిపించిన తరుణ్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.



 అయితే ఈసారి హీరోగా నటుడిగా కాకుండా నిర్మాతగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడట  తరుణ్.  ఇప్పటికే నిర్మాతగా మూడు సినిమాలను నిర్మిస్తున్నాడట తరుణ్. ఇందులో రెండు సినిమాలు ఓటీటి వేదికగా విడుదల చేసేందుకు సిద్ధమవుతుండగా మరొక సినిమా థియేటర్లో విడుదల చేసేందుకు తరుణ్ సిద్ధమవుతున్నారట. కాగా  ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా నటించిన తరుణ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మరి నిర్మాతగా తన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా  కలిసి వస్తుందో అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: