ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి,
సాహో తరువాత
బాలీవుడ్ లో స్టార్ హీరోగా అపరిమితమైన
మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. దేశం మొత్తం నలుమూలాల ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో "ఆది పురుష్"
సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో రాముడిగా
ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.. మిగిలిన పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే
సీత పాత్రలో నటించే హీరోయిన్‌పై రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో
సీత పాత్ర కోసం
కీర్తీ సురేష్,
కియారా అడ్వాని,
దీపిక పదుకొనే అంటూ హీరోయిన్ల పేర్లు తెగ వినిపించాయి.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో
బాలీవుడ్ హాట్
బ్యూటీ అనన్య పాండేను ఫిక్స్ చేసినట్లు కథనాలు చాలా బలం గా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ‘ఆదిపురుష్’లో ఆమెకు తీసుకున్నారన్న వార్తతో
ప్రభాస్ అభిమానులు అవాక్కవుతున్నారు. ఇంత పెద్ద సినిమాలో అంత చిన్న
హీరోయిన్ ఏంటని, ఆమెకు సరిగ్గా యాక్టింగ్ కూడా రాదని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా భారీ ఇమేజ్ ఉన్న
హీరోయిన్ అయితే బాగుంటుందని, ప్రభాస్ కటౌట్ ముందు
అనన్య తేలిపోతుందని అంటున్నారు. ఫైనల్‌గా ఈ పాత్రకు ఎవరు ఫిక్స్ అవుతారో తెలియదు కానీ రోజుకొక గాసిప్ మాత్రం ఫ్యాన్స్‌కు విసుగు పుట్టిస్తుందనే చెప్పాలి.
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ సినిమాలో
అనన్య పాండే నటిస్తోంది. ఇలాంటి మరెన్నో
మూవీ విషయాలు కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..