జీ తెలుగు లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షో కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత  మెగా బ్రదర్ నాగబాబు జడ్జిగా మొదలైన అదిరింది షో బుల్లితెర ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎంతగానో ఆకర్షించింది. ఒకప్పుడు జబర్దస్త్ లో చేసిన ఎంతో మంది కమెడియన్స్ ప్రస్తుతం అదిరింది షో లో తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఎంతగానో ఆకర్షిస్తుంది విషయం తెలిసిందే. ఇక రోజురోజుకి అదిరింది షో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులందరికీ టీవీ లకు కట్టిపడేస్తు ఎంతగానో ఆకర్షిస్తుంది..




 అయితే అదిరింది షో  మరింత పాపులర్ చేయడానికి బుల్లితెర ప్రేక్షకుల్లోకి  మరింతగా తీసుకువెళ్లడానికి అదిరింది షో నిర్వాహకులు ఎప్పుడూ సరికొత్త ఆలోచనతో తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ అదిరింది షో ఎంతగానో అలరిస్తుంది .
కాగా ప్రతి వారం అదిరింది షో కి సరికొత్త గెస్ట్ వచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్న  విషయం తెలిసిందే. కాగా గత ఆదివారం బొమ్మ అదిరింది షో కి గెస్ట్ గా పోసాని కృష్ణమురళి  వచ్చి తనదైన శైలిలో అలరించి బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచారు.



 ఇక ఈ వారం టాలీవుడ్ లోని ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ బొమ్మ అదిరింది షో కి గెస్ట్ గా వచ్చి ఇటీవలే బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. రావడం రావడమే పవన్ కళ్యాణ్ స్టెప్ వేసిన బండ్ల గణేష్  ఆకర్షించాడు. ఇక ఇదే సమయంలో ఈ షోలో ముఖ్యమైన వాళ్ళు కానీ వారిని కూడా పరిచయం చేస్తున్నాను అంటూ యాంకర్ శ్రీముఖి పండు ని పరిచయం చేస్తుంది. ఈ క్రమంలోనే పండు నాగబాబును డాడీ అని పిలుస్తాడు . దీంతో బండ్ల గణేష్ షాక్ అవ్వటంతో..  వాడు కూడా నా కొడుకు లాంటి వాడు అంటూ చెబుతాడు నాగబాబు.. వెంటనే స్పందించిన బండ్లగణేష్ ఏ ఊరుకో అన్న.. నీ కొడుకు ఇంత చండాలంగా ఉంటాడా అంటూ పంచ్  వేయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: