
ఈ పాటపై ప్రముఖ నటుడు తరుణ్ స్పందించారు .తరుణ్ మాట్లాడుతూ , అర్హ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడే అంజలి కవర్ సాంగ్ చూసాను చాలా బాగుంది ..ఈ వీడియోని చూస్తుంటే ఒరిజినల్ అంజలి పాటని చేస్తున్నట్లే అనిపిస్తుంది.. అంత చక్కగా నటించవని అర్హ ని మెచ్చుకున్నారు తరుణ్ .. మీకు తెలుసు ఒరిజినల్ పాటలో బేబీ షామిలి కి అన్నయ్యగా తరుణ్ నటించారు .. ఇప్పుడు ఈ పాటలో అర్హ కి అన్నయ్య పాత్రలో అయాన్ చేయడం చాలా సరదాగా అనిపించిందని తరుణ్ అన్నారు .. అలాగే అంజలి కవర్ సాంగ్ చేసిన టీం అందరికి తరుణ్ అభినందనలు తెలిపారు ..
బాల నటుడిగా తెరపైకి వచ్చి హీరో అయిన నటులలో తరుణ్ ఒకరు ... నువ్వేకావాలి ,నువ్వే నువ్వే లాంటి సినిమాలతో హీరోగా మంచి పేరు అందుకున్నారు .. అప్పట్లో తరుణ్ చేసిన కొన్ని సినిమాలు విజయవంతం కావడం తో హీరోగా ఒక వెలుగు వెలిగారు .. ఆ తర్వాత చేసిన సినిమాలు వరుస పరాజయాలు కావడం తో తరుణ్ సినిమాలకి దూరం అయ్యారు ..
పాతతరం హీరోలు చాలా వరకు వెనకబడుతున్నారు.. పాత తరం హీరోలు ఈ మధ్య అసలు సినిమాలు చేయడం లేదు .. తరుణ్ , వడ్డే నవీన్ , శ్రీ కాంత్ వీళ్ళందరూ మళ్ళీ ఫామ్ లోకి రావాలని , సినిమాలు చేయాలనీ మనసారా కోరుకుంటున్నాను ..