చేతిలో ఒక అగ్గిపుల్ల తీసి దానిని వెలిగించి మన చేయి కాలకుండా మన అవసరాలు తీర్చుకున్నట్లుగా డబ్బును కూడ ఒక తెలివైన ఆట వస్తువుగా ఆడించగలిగినప్పుడు మాత్రమే ఏ వ్యక్తి అయినా ధనవంతుడు కాగలుగుతాడు. చాలామంది ఎప్పుడు ఆర్ధిక సమస్యలతో సతమతమైపోతూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో డబ్బు చాల కీలకంగా మారుతూ ఉంటుంది.


మనం ఏదైనా సెల్ ఫోన్ కాని అదేవిధంగా ఒక టెలివిజన్ కానీ మరో రిఫ్రిజిరేటర్ కాని కొన్నప్పుడు మనకు ఒక గ్యారెంటీ కార్డు అదేవిధంగా ఆ వస్తువునకు సంబంధించిన చిన్న బుక్ లేట్ మన చేతికి ఇచ్చి ఆ వస్తువును ఎలా వాడుకోవాలో తెలియచేస్తారు. అదేవిధంగా డబ్బు మన చేతికి వచ్చినప్పుడు ఆ డబ్బును ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో తెలియచేసే ‘మనీ మాన్యువల్’ ఎవరు ఎవరికి ఇవ్వరు.


ఎవరికి వారే తమకు ఉన్న పరిస్థితుల రీత్యా తమ పరిస్థితులకు అనుగుణంగా తమ సొంత ‘మనీ మాన్యువల్’ ను క్రియేట్ చేసుకుని మన దగ్గర ఉన్న డబ్బును ఎలాంటి ప్రాధాన్యతలతో ఖర్చు చేయాలో ఆలోచనలు నిరంతరం చేస్తూ ఉండాలి. అయితే ఇలాంటి మనీ మాన్యువల్ ను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎవరికి వారు తమ జీవిత అనుభవాల రీత్యా ప్రవర్తిస్తూ ఉండాలి.  


వాస్తవానికి చాలామంది తమ డబ్బు విషయంలో కొందరు అమాయకంగా మరికొందరు వేలంవెర్రిగా మరికొందరు మొండిగా మరికొందరు పరిజ్ఞానం లేకుండా డబ్బును ఎలా వాడాలి అన్న కళ తెలియకుండా రకరకాలుగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే ఇలా ప్రవర్తించే వారి పెట్టుబడిలో కేవలం 10 శాతం మంది మాత్రమే విజయాన్ని అందుకుంటే 90 శాతం మంది ఎప్పుడు నష్టపోతూ ఉంటారు. డబ్బును మ్యానేజ్ చేసే కళకు సంబంధించి ప్రపంచంలో ఎక్కడా శిక్షణ లేదు. అయితే పగలు రాత్రి ప్రతి క్షణం జనం ఆలోచనలు డబ్బు వైపే అడుగులు వేస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో మనీ మేకింగ్ లో సక్సస్ అందుకోవాలి అని భావించే వారు ఎవరికి వారు వారి ప్రత్యేకమైన ‘మనీ మాన్యువల్’ క్రియేట్ చేసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: