ఏదైనా సినిమా మొదలయ్యిందంటే మొదట హీరో గురించి ఆ తర్వాత హీరోయిన్ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇటీవల కమెడియన్లు కూడా సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులను సీట్స్ కి కట్టిపడేసేది ఒక్క కామెడీనే. అందుకే ప్రతి సినిమాలో కామెడీ కి పెద్ద పీట వేస్తున్నారు. అందుకే కమెడియన్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరి మన టాలీవుడ్ లో కమెడియన్స్ ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో ఒకసారి చూద్దాం.

1.బ్రహ్మానందం: నవ్వుల బ్రహ్మి ఒక్క రోజుకు తీసుకునే పారితోషకం రూ. 5లక్షలు

2. అలీ:  చైల్డ్ ఆర్టిస్ట్ నుండి నేటి వరకు నవ్విస్తున్న అలీ ఒక రోజుకి తీసుకునేది కేవలం మూడున్నర లక్షలు మాత్రమే

3. వెన్నెల కిషోర్ : ఈ మధ్య కాలం లో వెన్నెల కిషోర్ లేని సినిమా ఉండటం లేదు. ఈయన ఒక రోజు పారితోషకం రూ. 3లక్షలు

4. పృథ్వీ రాజ్: 30 ఇయర్స్ డైలాగ్ తో గుర్తింపు తెచ్చుకున్న పృథ్వి ఒక రోజు కోసం రూ. 2లక్షల వరకూ తీసుకుంటున్నారు.

5. సప్తగిరి: తనదైన  శైలి లో కామెడీ చేస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగిన సప్తగిరి రోజుకు రూ. 2లక్షలు తీసుకుంటున్నారు.

6. రాహుల్ రామకృష్ణ: ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేటి తరం కమెడియన్ లలో రామకృష్ణ ఒకరు. ఈయన ఒకరోజు కి రూ. 2లక్షలు
తీసుకుంటున్నారు.

7. శ్రీనివాస రెడ్డి: సూపర్ టైమింగ్ తో దూసుకెళ్లి శ్రీనివాస్ రెడ్డి ఒక్క రోజు కోసం రూ. 2లక్షలు తీసుకుంటున్నారు.

8. సునీల్ : ఈ హీరో కం కమెడియన్ ప్రస్తుతం రోజుకు రూ. 4లక్షల వరకూ ఛార్జ్ చేస్తున్నారు.

9. ప్రియదర్శి:  ఈ పెళ్లిచూపులు కమెడియన్ ఒక్కో రోజు రూ. 2 లక్షల వరకూ తీసుకుంటున్నారు.

10. పోసాని కృష్ణమురళి: మ్యానెరిజమ్స్ నే కామెడీ గా మార్చిన ఈ కమెడియన్ ఒక్క రోజుకు రూ. రెండున్నర లక్షల వరకూ తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: