సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ కపుల్స్ ఒకరు అజిత్ మరియు షాలిని. ఇద్దరు కలిసి సినిమాలో నటిస్తున్న క్రమంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి కోలీవుడ్ లోనే ఒక సంచలనం. ఇప్పటికి వీరికి పెళ్ళై 21 ఏళ్ళు. అజిత్ ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగితే..చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించి యుక్త వయసు రాగానే హీరోయినా గా మారింది షాలిని. అజిత్ ని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది షాలిని. ఈ కపుల్ ఎంత సింపుల్ గా ఉంటారో ఒరత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దంపతులకు ఒక కుమార్తె మరియు కుమారుడు ఉన్నారు.

కూతురి కోసం షాలిని పాట్లు

ఇక పిల్లలంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే అమ్మానాన్నలయ్యాక అజిత్ షాలిని లు కూడా తమ పిల్లలే పంచప్రాణాలుగా ఉంటారు. ఇక షాలిని అయితే అజిత్ స్టార్ డం ని ఇంటి బయటవరకే మైంటైన్ చేస్తుంది. ఒక్కసారి ఇంట్లోకి వచ్చారా కేవలం ఒక నాన్నలాగా మాత్రమే ఉండాలంటూ అజిత్ కి ఆర్డర్ వేస్తుందట. పిల్లల ప్రతి ఫంక్షన్ కి అజిత్ షాలినీ ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. చిన్న స్పోర్ట్ ఈవెంట్ అయినా కూడా అజిత్ దగ్గర ఉంది కూతురిని ఎంకరేజ్ చేయడానికి స్కూల్ కి వెళ్ళిపోతాడు. షూటింగ్స్ లో బిజీ ఉన్న కూడా అన్ని పిల్లల తర్వాతే. ఇక షాలిని పట్టుదల గురించి ఎంత చెప్పిన తక్కివే. తన కూతురు అనౌష్క కి టెన్నిస్ అంటే ఇష్టమని ఏకంగా షాలిని టెన్నిస్ ఆడటం స్టార్ట్ చేసి తమిళనాడు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే స్థాయి వరకు వెళ్ళింది. ఇలా కూతురి ఇష్టం తన ఇష్టం అనుకుంటుంది షాలిని.

ఇప్పుడు షాలిని అజిత ల కూతురు అనౌష్క టీనేజ్ లో ఉంది. చిన్నప్పటి  నుండి ఆమె ఎంత క్యూట్ గా ఉండేదో నెట్లో ఆమె ఫోటోలను చూస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు కాస్త యుక్త వయసుకు రాగానే అనౌష్క ఎంత అందంగా ఉందో చూడటానికి మీ రెండు కళ్ళు సరిపోవు. అనౌష్క అందంలో తల్లి షాలిని ని మించిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: