రాజకీయాలలో సినిమాలలో కొనసాగే ప్రముఖ వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చి ఒకరి పై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. ఆ తరువాత అలాంటి ఘాటైన విమర్శలు చేసిన వ్యక్తులు మళ్ళీయూటర్న్ తీసుకుని ఒకర్ని ఒకరు అభినందించుకుంటు కౌగలించుకుంటు కనిపించడం సర్వసాధారణంగా మారింది. ఈమధ్య పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం పై చాల ఘాటైన కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు.


తాను ఒక వ్యక్తి అభిప్రాయాలతో విభేదిస్తాను కానీ ఏ వ్యక్తి పట్లా తనకు వ్యక్తిగత శతృత్వం ఉండదు అంటూ కామెంట్స్ చేసాడు. వాస్తవానికి ఒక వ్యక్తిగా పవన్ ను తాను అభిమానిస్తానని అయితే పవన్ రాజకీయ ఎత్తుగడలు మాత్రం తనకు నచ్చావు అని కామెంట్స్ చేసాడు. అంతేకాదు మహేష్ జూనియర్ ఎన్టీఆర్ లతో కూడ తనకు ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయని అంతమాత్రం చేత వాళ్ళ సినిమాలలో తాను నటించడం లేదా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు.


ప్రస్తుతం తాను పవన్ తో కలిసి ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ లో పాల్గుంటున్నప్పుడు కూడ షూటింగ్ గ్యాప్ లో ఒక విషయమై తామిద్దరం చాల గట్టిగా మాట్లాడుకున్నామని అయితే షాట్ రెడీకాగానే తమ భేదాభిప్రాయాలు మర్చిపోయి తాము సన్నిహితంగా నటించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు తాను ఈమధ్య ‘దోసిట చినుకులు’ కవితల పుస్తకాన్ని తాను ‘వకీల్ సాబ్’ సెట్ పై పవన్ కు ఇస్తే పవన్ ఆ పుస్తకంలోని ప్రతి కవితను చాల శ్రద్ధగా చదివి తనను ఎంతో ప్రశంసించిన విషయాన్ని బయటపెట్టాడు.


అంతేకాదు తాను పవన్ తో కలిసి నటిస్తానని సినిమాలు వేరు వ్యక్తిగత అభిప్రాయాలు వేరు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ ఇచ్చిన వివరణతో పవన్ ప్రకాష్ రాజ్ ల మధ్య ఏర్పడిన ఈ లేటెస్ట్ వార్ ఇక ముగిసిపోయినట్లే అర్థం అవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: