సినిమాలు గతంలోలా లేవు అంటారు. దానికి కారణం ఇపుడు వస్తున్న మూవీస్ అన్నీ కూడా హీరోను దృష్టిలో పెట్టుకుని కంటెంట్ తయారు చేసిన‌వే. అంటే సినిమా మొత్తం హీరోవే నడపాలి. స్టార్ హీరోల స్టామినాకు ఇది బిగ్ చాలెంజ్. అయితే దాన్ని చాలా ఈజీగా అధిగమించే హీరోలు టాలీవుడ్ నిండా ఉన్నారు. తన రెక్కల కష్టంతో సినిమాను అవతల ఒడ్డుకు చేర్చి వందల కోట్ల కాసుల వర్షం కురిపిస్తున్న క్రెడిట్ మన హీరోలదే.

ఇక 2013 వరకూ టాలీవుడ్ వంద కోట్ల మార్కెట్ ని టచ్ చేసి ఎరగదు. పవన్ త్రివిక్రం అత్తారింటికి దారేది మూవీతో ఆ రేర్ ఫీట్ ని సాధించాడు. ఏకంగా  వంద కోట్లకు పైబడి కలెక్షన్లు వసూల్ చేసిన ఫస్ట్ తెలుగు సినిమాగా అది రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత వచ్చిన బాహుబలి వన్, బాహుబలి టూ తో తెలుగు సినిమా రేంజి ఎక్కడికో వెళ్ళిపోయింది.

హీరోల మీద వందల కోట్లు పెట్టుబడి పెడితే తప్పు లేదు అని కూడా రుజువు అయింది. అలా టాప్ స్టార్స్ మీద పెట్టుబడి పెట్టినా రిస్క్ అని కూడా ఏ నిర్మాతా అనుకోవడంలేదు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రీ ఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ వస్తోంది. ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఉంది. ఈ మూవీ హిందీలో హిట్ అయిన మూవీకి రీమేక్. ఇక పవన్ రెండేళ్ళ పాటు వెండి తెరకు దూరంగా ఉన్నాడు. దాంతో చేసే తరువాత మూవీ ఎలా ఉంటుంది ఏంటి అన్న క్యూరియాసిటీ ఈ సినిమాకు కమర్షియల్ బలంగా ఉంటుంది.

దాంతో పాటు పవన్ మూవీస్ లేవే అని ఫీల్ అయ్యే ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్స్. ఇక కధలో బలం ఉంది. మంచి స్క్రీన్ ప్లే అంటున్నారు. ఖర్చుకు వెనకాడని నిర్మాత దిల్ రాజు ఎటూ ఉన్నారు. దాంతో ఈ మూవీ సూపర్ హిట్ అవడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ మూవీ కోసం పవన్ కి యాభై కోట్లు రెమ్యునరేషన్ గా దిల్ రాజు ఇచ్చాడని ఫిల్మ్ సర్కిల్స్ న్యూస్. అదే కనుక నిజం అయితే మాత్రం ఇంతకంటే ఎక్కువ తీసుకున్న హీరో ఇప్పటిదాకా టాలీవుడ్ లో లేడు. ఆ విధంగా కూడా పవన్ రికార్డ్ క్రియేట్ చేసినట్లే. మొత్తానికి పవన్ కి ఉన్న డిమాండ్ కి ఇది నిదర్శనం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: