ఎవరు చేయని సాహసాన్ని చేస్తూ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పెద్ద డేర్ స్టెప్ వేస్తున్నాడు.. అయన నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను ధియేఆర్లో రిలీజ్ చేషున్నాడు.  తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యి చాలా రోజులే అయిపొయింది.. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇప్పటివరకు సినిమా థియేటర్లను ఓపెన్ చేయలేదు. నిర్మాతలు కూడా ఈ టైం లో సినిమా లు రిలీజ్ చేతులు కాల్చుకోవడం ఇష్టం లేక ఊరుకున్నారు.. దీంతో సంక్రాంతికే సినిమాలు వస్తాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం సినిమా లు రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడులో దీపావళి పండగ సందర్భంగా సగం కెపాసిటీతోనే బిస్కోత్ లాంటి కొత్త మూవీస్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులను రప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ ధైర్యం ఎవరు చెయ్యట్లేదు.. అయితే సాయి ధరమ్ తేజ్ తన సినిమా ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నది తెలుస్తుంది.. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్సినిమా కి సంగీతం అందిస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.

సాయి తేజ్ సినిమాని థియేట్రికల్ తో సహా మొత్తం హక్కులు కొన్న జీ సంస్థ దాన్ని స్వంతంగా విడుదల చేసే వ్యవస్థ లేకపోవడంతో పాటు అనుభవలేమి వల్ల దాని హక్కులను ఏరియాల వారీగా అమ్మేసే ప్లాన్ లో ఉన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఒకటి రెండు ప్రాంతాలకు డీల్ కూడా పూర్తయ్యిందని ఇన్ సైడ్ న్యూస్. కాకపోతే సాధారణ పరిస్థితుల్లో వచ్చే రేట్ కంటే ముప్పై నలభై శాతం తక్కువగా వస్తోందట. ఉదాహరణకు పన్నెండు కోట్ల దాకా పలికే నైజామ్, ఆంధ్ర రైట్స్ ఇప్పుడు ఎనిమిది కోట్ల దగ్గరే ఆగిపోయింది. యువి వంశీ దాదాపుగా ఈ మార్క్ ని క్లోజ్ చేసినట్టుగా వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: