
అందుకే ఆ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టింది. 10, 50, 100 మిలియన్లు దాటి ఇప్పుడు ఏకంగా 150 మిలియన్ వ్యూస్ సాధించి సత్తా చాటింది. వైష్ణవ్ తేజ్ తొలి సినిమాకే ఈ రేంజ్ బూస్టింగ్ వస్తుందని ఊహించలేదు. ఇక సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై మంచి క్రేజ్ వచ్చేలా చేశాయి. చూస్తుంటే ఉప్పెనతో మొదటి సినిమాతోనే వైష్ణ తేజ్ సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.
సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కృతి శెట్టికి కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. చూస్తుంటే ఈ సినిమా హీరో, హీరోయిన్ ఇద్దరు ఈ సినిమా తర్వాత స్టార్ క్రేజ్ దక్కించుకునేలా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అవకుండానే వైష్ణవ్ తేజ్ క్రిష్ తో సినిమా పూర్తి చేశాడు. ఆ సినిమా కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కింది. ఉప్పెన రిలీజ్ అవడమే ఆలస్యం ఆ తర్వాత క్రిష్ సినిమా కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.