ఈనెల 9న జరగబోతున్న నిహారిక పెళ్ళి ఏర్పాట్లలో మెగా ఫ్యామిలీ చాల బిజీగా ఉంది. రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ లో ఈ పెళ్ళి జరగబోతోంది. ఈ పెళ్ళి వేడుకకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు హాజరుకాబోతున్న టాప్ గెస్ట్స్ లిస్ట్ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.


ఈ పెళ్ళికి బాలకృష్ణ కూడ రాబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జునలకు చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేసి తన సోదరుడు కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించాడని నాగబాబు స్వయంగా వారిని తన కుమార్తె పెళ్ళికి పిలిచినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే వరుణ్ తేజ్ తో సన్నిహితంగా ఉండే మ రానా నితిన్ నాగచైతన్య ఫ్యామిలీస్ తో నిహారిక పెళ్ళికి రానున్నారని తెలుస్తోంది. ఈ పెళ్ళికి అటెండ్ అయ్యే క్రేజీ హీరోయిన్స్ లిస్టులో పూజా హెగ్డే రష్మిక మందన అటెండయ్యే వీలుంది. అలాగే కొరటాల శివ రాజమౌళి త్రివిక్రమ్ లాంటి సీనియర్ దర్శకులతో పాటు కోదండరామిరెడ్డి రాఘవేంద్రరావు లకు కూడ ఆహ్వానం వెళ్ళినట్లు టాక్.


ఈ పెళ్ళికి ఎంతమంది ప్రముఖులు వచ్చినా రాకపోయినా అందరి దృష్టి మాత్రం పవన్ కళ్యాణ్ పై ఉంది. దీనికితోడు ఇప్పుడు నిజంగానే నాగబాబు ఆహ్వానాన్ని మన్నించి బాలకృష్ణ ఈ పెళ్ళి వేడుకకు ఎటెండ్ అయితే చిరంజీవి బాలయ్యల మధ్య ఇప్పుడు కొనసాగుతున్న ఒక చిన్న గ్యాప్ ను కలిపే పెళ్ళిగా నిహారిక పెళ్ళి మారబోతోంది. ఇది ఇలా ఉండగా నిహారికను పెళ్ళికూతురును చేసిన ఫోటోలు ఇప్పటికే మీడియాకు వైరల్ గా మారాయి. గోల్డ్ అండ్ పర్పుల్ బోర్డర్ తో ఉన్న గ్రీన్ సారీ కట్టుకుని నడుముకు వడ్డాణం ముక్కుపుడక పచ్చల హారంతో దగదగా మెరిసిపోతున్న నిహారిక అచ్చమైన తెలుగింటి అమ్మాయి లా పెరిసిపోతున్న ఫోటోలను చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: